మృగశిర కార్తె సందడి..
ABN, First Publish Date - 2023-06-09T00:17:18+05:30
మృగశిర కార్తె రోజు చేపలు తింటే మంచిదనే నమ్మకంతో గురువారం చేపల కోసం గోదావరిఖని మార్కెట్‌లో జనం ఎగబడ్డారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 8: మృగశిర కార్తె రోజు చేపలు తింటే మంచిదనే నమ్మకంతో గురువారం చేపల కోసం గోదావరిఖని మార్కెట్‌లో జనం ఎగబడ్డారు. గోదావరిఖని చేపల మార్కెట్‌తో పాటు గాంధీనగర్, తిలక్‌నగర్, విఠల్‌నగర్, పవర్‌హౌస్‌కాలనీ, అడ్డగుంటపల్లిలో చేపలు కొనుగోలు చేయడానికి జనం ఎగబడ్డారు. కిలో బొమ్మ చేపలు సాధారణంగా రూ.500 ఉండగా రూ.700 ధర పలికింది. రవులు రూ.150 ఉంటే రూ.200లకు పెరిగింది. చిన్న చేపలు కూడా అధిక ధరలకు విక్రయించారు. పాపర్లు, కొరమీను, పాప్లెట్, జెల్లలు, చందమామ, బంగారు తీగలు కిలో రూ.500 ధర పలికాయి. సాధారణ రోజులకంటే మృగశిర కార్తె రోజు చేపల విక్రయం జోరుగా సాగింది. ప్రతి సెంటర్‌లో చేపల కొనుగోలు కోసం బారులు తీరారు.
చేప మందు ప్రసాదం పంపిణీ..
ఉబ్బసం వ్యాధి నివారణ కోసం మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ చేస్తారు. జనగామ జిల్లాకు చెందిన పరమేశ్ కుటుంబం మృగశిరకార్తె సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో గురువారం చేప మందు పంపిణీ చేశారు. ఉదయం 6గంటల నుంచే చేప ప్రసాదం పిల్లలు పెద్దలు తీసుకున్నారు. రూ.150లకు చేపమందును పంపిణీ చేశారు.
Updated Date - 2023-06-09T00:17:28+05:30 IST