ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామాల్లో వానర దండు

ABN, First Publish Date - 2023-07-03T01:31:11+05:30

వనాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి. మండలంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇళ్లలోకి చొరబడి బీభత్సం

- నియంత్రణ చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు

శంకరపట్నం, జూలై 2: వనాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి. మండలంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లో తినుబండారాలు, వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలు, పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోని ఆహార పదార్థాలు వస్తువులు చిందర వందర చేస్తున్నాయి. కిరాణ షాపులు, పండ్ల దుకాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బెడదతో పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. ఆరు బయట ఎండబెట్టిన పప్పు దినుసులు, ఇతర ఆహార పదార్థాలనూ కోతులు వదలడం లేదు. ఇళ్లలో ఉన్న మామిడి, జామ, బొప్పాయి, ఇతర పండ్ల చెట్లు, కూరగాయల చెట్లను, పంటలనూ కోతులు వదలకుండా ధ్వంసం చేస్తున్నాయి.

ఫ భయాందోళనలో ప్రజలు...

కోతుల బెడద రోజు రోజుకు ఎక్కువ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో చొరబడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో ఎదురు తిరిగి దాడి చేసి గాయపరుస్తున్నాయి. చాలా మంది కోతుల దాడిలో గాయపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కేశవపట్నం పీహెచ్‌సీలో మే నెలలో 36 మంది, జూన్‌ నెలలో 48 మంది కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందినట్లు వైద్యులు తెలిపారు. కోతుల నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కోతులను బందించి అటవీ ప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఫ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

- దేవరాజు, గ్రామస్థుడు, ఇప్పలపల్లి

కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. ఆహార పదార్థాలు, కూరగాయలను ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలు, ఇతర పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిని తరిమేందుకు ప్రయత్నిస్తే అవి దాడులకు దిగుతున్నాయి. అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలి.

Updated Date - 2023-07-03T01:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising