ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2023-04-16T00:20:55+05:30

: జిల్లాలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అఽధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 15: జిల్లాలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అఽధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో నియంత పాలన కొనసాగుతుందని దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేసి రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేసి ఇళ్ళు ఖాలి చేయిండం సిగ్గు చేటన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎల్లంపల్లి నుంచి ప్రారంభమయ్యే ఈ పాద యాత్రకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హాజరై ఘనస్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు నూగిళ్ల మల్లయ్య, మినపాల ప్రకాష్‌రావు, సాయిరి మహేందర్‌, భూతగడ్డ సంపత్‌, కట్కూరి సుధాకర్‌రెడ్డి, బొంకూరి అవినాష్‌, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, సయ్యద్‌ మస్రత్‌, సర్వర్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-16T00:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising