పద్మశాలీల ఐక్యతను చాటుదాం
ABN, First Publish Date - 2023-07-24T00:38:49+05:30
పద్మశాలీల ఐక్యతను చాటుదామని తెలంగాణ పద్మశాలి ఆత్మగౌరవ సభ రాష్ట్ర కన్వీనర్ బస్వాపురం లక్ష్మీనర్సయ్య అన్నారు.
వేములవాడ, జూలై 23 : పద్మశాలీల ఐక్యతను చాటుదామని తెలంగాణ పద్మశాలి ఆత్మగౌరవ సభ రాష్ట్ర కన్వీనర్ బస్వాపురం లక్ష్మీనర్సయ్య అన్నారు. వేములవాడ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన పద్మశాలి ఆత్మగౌరవ సభలో మాట్లాడారు. అన్ని రంగాల్లో ముందున్న పద్మశాలీలు రాజకీయ రంగంలో వెనుకంజలో ఉన్నారని, రానున్న రోజుల్లో ఐక్యతను చాటి రాజ్యాధికారం సాధించుకుందామని అన్నారు. బీసీ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న పద్మశాలీకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదని, అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని చట్టసభలకు ప్రాతినిధ్యం కల్పించకుండా విస్మరిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో వార్డు సభ్యుడి నుంచి అసెంబ్లీ వరకు పద్మశాలీల ప్రాతినిఽథ్యం ఉండే విధంగా రానున్న రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో పద్మశాలీ ఐక్యతను ఘనంగా చాటేందుకు ఆగస్టు 13న జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలి యుద్ధభేరి పేరిట భారీ సభను నిర్వహించ తలపెట్టామని అన్నారు. ఈ సభకు వేములవాడ ప్రాంతం నుంచి భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పద్శశాలి యుద్ధబేరి సభ పోస్టర్‌ను రాష్ట్ర, జిల్లా స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలి ఆత్మగౌరవ సభ రాష్ట్ర కోకన్వీనర్లు లగిశెట్టి శ్రీనివాస్, సాంబారి ప్రభాకర్, బోగ వెంకటేశ్వర్లు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పద్మశాలి సంఘం అధ్యక్షులు గాజజుల బాలయ్య, రుద్ర శ్రీనివాస్, వేముల రామ్మూర్తి, వేములవాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అవధూత రజనీకాంత్, శాశ్వత గౌరవ అధ్యక్షుడు తాటికొండ రాజయ్య, నాయకులు రాపెల్లి శ్రీధర్, వేముల శ్రీనివాస్, అంబటి బాలాద్రి, నాగుల విష్ణుప్రసాద్, దాసరి దేవేందర్, కొలిపాక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-24T00:38:49+05:30 IST