ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ర్టాన్ని అప్పుల ఊబి లోకి నెట్టిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2023-06-11T00:16:33+05:30

సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అప్పుల ఊబి లోకి నెట్టా రని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్గటూర్‌, జూన్‌ 10: సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అప్పుల ఊబి లోకి నెట్టా రని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం వెల్గటూర్‌ మండల కేం ద్రంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి విలేఖ రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ న్నికలు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌కు బీసీలు గుర్తుకు వచ్చి బీసీలకు లక్ష రూపాయలు అంటూ కొత్త పథకం తీసుకవచ్చారని ఎద్దేవా వేశారు. దేశం లో బీసీ ప్లాన్‌ అమలు చేయని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని మం డిపడ్డారు. ప్రజా ధనాన్ని వృధా చేస్తే చైనాలో ఉరి తీస్తారని కేసీఆర్‌కు అం త కన్నా చిన్న శిక్ష లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తు మ్మడిహట్టి కేంద్రంగా ప్రాణహిత జలాలను మల్లింపజేసి ఒకే లిఫ్ట్‌తో ఎల్లం పల్లి ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మా ణం రూపొందించిందని గుర్తు చేశారు. కానీ రీ డిజైనింగ్‌ పేరుతో కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో కాళే శ్వరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మాత్రమే మారబోతోందని జోస్యం చె ప్పారు. అవసరం లేని మూడవ టీఎంసీ ఎత్తిపోతలు కాళేశ్వరం లింక్‌-2 పే రుతో 700 ఎకరాల భూమి సేకరించి ధర్మపురి నియోజకవర్గ ప్రాంత రైతు ల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ మెప్పు పొందడానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చెన్నూరుకు గ్రావిటీ ద్వారా నీరు పొందే అవకాశం ఉన్నప్పటికీ రూ.1650 కోట్లతో సీఎం కేసీఆర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రారంభించడాన్ని తప్పుబట్టారు. దశాబ్ది ఉత్సవాలలో దళిత బంధు కనబడుతోందా? అని ప్రశ్నించారు. బీసీలకు ఇవ్వనున్న లక్ష రూపాయల పథకంలో గీత, నేత, మత్స్య కార్మికుల వంటి కులాల వారు అ నర్హులని, అలాంటి పథకం తీసుకవచ్చి బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మిస్తే 2లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని, దీనిని వదిలి పెట్టి మేడిగడ్డ ప్రా జెక్టు నిర్మాణం చేపట్టడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ అధికాంలోకి రాగానే ప్ర త్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టి మొదటి వేసవి వరకే నీరందించేలాతుమ్మడి హట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టేలా మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఈ కా ర్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పూదరి రమే ష్‌, సర్పంచ్‌ మురళి, సందీప్‌రెడ్డి, ఉదయ్‌, వెంకటస్వామి, తిరుపతి, లక్ష్మ ణ్‌, శ్రీనివాస్‌, జనార్ధన్‌, శ్రీధర్‌, దుర్గయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising