ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగిత్యాల జైత్ర యాత్రలో గొంతెత్తిన గద్దర్‌

ABN, First Publish Date - 2023-08-07T01:20:14+05:30

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు వస్తుంది.

కథలాపూర్‌ మండలం భూషణ్‌రావుపేటలో పాటలు పాడుతున్న గద్దర్‌(ఫైల్‌)

జగిత్యాల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు వస్తుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన గాయకుడు గద్దర్‌ హాజరై జనాన్ని ఉర్రూతలూగించిన ఘటనను ఉద్యమకారులు, జగిత్యాల జనం గుర్తు చేసుకుంటున్నారు. ఎ లాంటి సమాచార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మా టల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటు చేరిన రోజు అయిన జగిత్యాల జైత్రయాత్ర సభకు హాజరై తన పాటలతో జనాన్ని ఉర్రూతలూగించిన ఘటనను నెమరేసుకుంటున్నారు. ఆనాడు జగిత్యాల మంచినీళ్ల బావి వద్ద సద్దులు తిన్న సందర్భంలో వందలాది సానుభూతిప రులు, మిలిటెంట్లు, స్థానికులు గద్దర్‌ను చూడడానికి ఎగబడడం, వారి నుంచి ఇబ్బందులు తలెత్తకుండా పలువురు ఉద్యమకారులు బందోబస్తులో ఉండడం వంటి ఘటనలను స్థానికులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. జగి త్యాలలోని అన్నపూర్ణ టాకీస్‌ వద్ద నుంచి పోచమ్మవాడ, తీన్‌ఖని చౌరస్తా, మంచి నీళ్ల బావి వరకు జరిగిన భారీ ర్యాలీలో పోలీస్‌స్టేషన్‌ వద్ద గాయకు డు గద్దర్‌ పాల్గొని పాడిన పాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అక్కడి నుంచి స్థానిక ఓల్డ్‌ హైస్కూల్‌ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభకు గద్దర్‌ హాజరై గజ్జె కట్టి ఆడాడు.. పాడాడు. ఆనాటి సంఘటన మరిచిపోలేక ఉన్నామని పలువురు ఉద్యమకారులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై విరుచుకపడ్డ తీరు..పీపుల్స్‌ వార్‌, మావోయిస్తు పార్టీల ఉద్యమాలకు పాఠశాలగా, ప్రయోగశాలగా జగిత్యాల జైత్రయాత్ర ఉపకరించిన సందర్బాన్ని మరచిపోలేకున్నామని ఉద్యమబాటలో ప్రయా ణించిన వారు అంటున్నారు. రైతు కూలీ సంఘాలు..పీపుల్స్‌ వార్‌గా.. మా వోయిస్తు పార్టీగా రూపాంతరం చెందడానికి భీజం పోసిన జగిత్యాల జైత్ర యాత్ర వేదికపై మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌ రావు అలియాస్‌ గణపతి, శీలం నరేశ్‌, మల్లోజుల కోటేశ్వర్‌ రావు అలియాస్‌ కిషన్‌ జీ, కైరి గంగారం, గజ్జెల గంగారం, అంగ ఓదెలు, గద్దర్‌తో పాటు పలువురు పాల్గొ ని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. నాటి ఈ జైత్రయాత్ర నిర్వాహకులు కొందరు తదుపరి జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లలో మృతి చెం దగా, మరికొందరు లొంగిపోయారు. ఇంకొందరు అడవి బాట పట్టారని నాటి ఉద్యమకారులు అంటున్నారు. జగిత్యాల జైత్రయాత్రలో గద్దర్‌ తనదై న భూమికను పోషించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనంతరం జరిగిన పలు కార్యక్రమాలతో పాటు 1968లో జరిగిన తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్‌ జిల్లాలోని జగిత్యాల, కోరు ట్ల, మెట్‌పల్లి, వెల్గటూరు, బీర్‌పూర్‌, సారంగపూర్‌ తదితర ప్రాంతాల్లో పర్య టించి తనదైన శైలిలో పాటలు పాడారు. తెలంగాణ మలి దశ ఉద్యమం లో భాగంగా ధూం ధాం పేరిట జరిగిన పలు బహిరంగ సభలకు ప్ర జాగాయకుడు గద్దర్‌ హాజరై పాటలు పాడి ప్రసంగించారు. పలు పర్యా యాలు జగిత్యాలకు వచ్చిన గాయకుడు గద్దర్‌ జైత్రయాత్రకు కేంద్రమైన పట్టణాన్ని మరిచిపోలేనని అంటూ భూమాతను ముద్దాడినట్లు అంటు న్నారు. జగిత్యాల మట్టిని మూటగట్టుకొని భద్రపరచుకొని గద్దర్‌ వెంట తీసుకెళ్లాడని స్థానికులు పేర్కొంటున్నారు. జగిత్యాలలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, మల్యాలలో జగ్జీవన్‌ రాం విగ్రహావిష్కరణతో పాటు పలు ఉద్యమ కార్యక్రమాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో గద్దర్‌ పాల్గొని నిర్వహిం చిన ఆటా..పాటలు ప్రజల మదిల్లో మెదులుతున్నాయి.

Updated Date - 2023-08-07T01:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising