మంథనిలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ABN, First Publish Date - 2023-10-17T00:08:04+05:30
మంథని నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా క్యాడర్ పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు అన్నారు.
మంథని, అక్టోబర్ 16: మంథని నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా క్యాడర్ పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు అన్నారు. స్థానిక శ్రీమహాలక్ష్మి ఫంక్షన్ హాల్ బీజేపీ రాష్ట్ర నేత చంద్రుపట్ల సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రదీప్‌రావు మాట్లాడారు. 40 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ మంథని ప్రాంతానికి చేసింది ఏమీలేదని, 9సంవత్సరాల బీఆర్‌ఎస్ అన్ని వనరు లను దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమనాయకుడు చంద్రు పట్ల సునీల్‌రెడ్డి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ఆమె రికాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన తనకు మంథని ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి, రాష్ట్ర ప్రభుత్వ అవినీ తిపాలనకు వ్యతిరేకంగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, నేతలు రావుల రాంనాథ్, చీలారపు పర్వతాలు, మల్క మోహన్‌రావు, నాంపల్లి రమేష్, చిలువేరి సతీష్‌కుమార్, పో తరవేన క్రాంతికుమార్, సబ్బని సంతోష్, ఎడ్ల సదాశివ్, బూడిద తిరుపతి, కొం డపాక సత్యప్రకాష్, బోగోజు శ్రీనివాస్, ఉడుముల విజయారెడ్డి, జంగపల్లి అజ య్, రాకేష్, మల్లారెడ్డి, తిరుపతిలు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-17T00:08:04+05:30 IST