ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి వస్తే ఐదు వందలకే సిలిండర్‌ ఇస్తాం

ABN, First Publish Date - 2023-03-05T00:34:54+05:30

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు వందలకే సిలిండర్‌ అందిస్తామని మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మి దేవేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర పభుత్వం పెంచిన సిలిండర్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కట్టెల పొయ్యిపై వంటా వార్పు నిర్వహిస్తున్న మహిళా నాయకురాళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు విజయ లక్ష్మి

వంట గ్యాస్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ ఆందోళన

జగిత్యాల టౌన్‌, మార్చి 4 :కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు వందలకే సిలిండర్‌ అందిస్తామని మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మి దేవేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర పభుత్వం పెంచిన సిలిండర్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరా భవన్‌ నుం చితహసీల్‌ చౌరస్తా వరకు నెత్తిన కట్టెల మోపులు ఎత్తుకుని నిరసన ర్యాలీ నిర్వహించి, మోదీ, కేసీఆర్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ప్ర ధాన రహదారిపై వంటా, వార్పు నిర్వహించారు. అనంతరం విజయ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ సామాన్యులను దోచుకుంటూ పదే పదే వంట గ్యాస్‌ రేట్లు పెంచుతూ ఆడబిడ్డలను కన్నీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. 2014లో కనీస కరెంటు బిల్లు రూ. 60 ఉండగా నేడు 10 రేట్లు పెరిగిందని, భూములు రిజిస్ట్రేషన్‌ ఐదిం తలు, బస్సు చార్జీలు మూడింతలు పెరిగియాని ఇది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదించిన ప్రగతి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణా లేకుం డా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడ బిడ్డలపై మొసలి కన్నీరు కార్చకుండా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పెంచిన సిలిండర్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, సిలిండర్‌ ధరలు తగ్గించేత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజిం గ్‌ సెక్రటరి బండ శంకర్‌, ప్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, నాయకులు గాజుల రాజేందర్‌, అల్లాల రమేష్‌ రావు, పుప్పాల అశోక్‌, నక్క జీవన్‌, కచ్చు హ రీష్‌, గుండ మధు, చాంద్‌ పాష, మన్సూర్‌, నేహాల్‌, మహిళా నాయ కురాళ్ల మేరుగు రమ్య, పులి సునీత, అల్లాల సరిత, లత, పద్మ, చిట్ల లత, రజిత, లావణ్య, రజిత, జ్యోతి ఉన్నారు.

Updated Date - 2023-03-05T00:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising