జిలెటిన్ స్టిక్స్ పట్టివేత
ABN, First Publish Date - 2023-08-22T01:12:57+05:30
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చిన్నబోనాలలో 153 జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జిలెటిన్ స్టిక్స్ నిల్వచేసిన వ్యక్తిని అరెస్ట్ చూపారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 21: సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చిన్నబోనాలలో 153 జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జిలెటిన్ స్టిక్స్ నిల్వచేసిన వ్యక్తిని అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిలెటిన్ స్టిక్స్‌ను నివాస ప్రదేశంలో నిల్వచేసిన చిన్నబోనాలలో నివాసం ఉంటున్న సూర్యపేట జిల్లాలోని నాగారం గ్రామానికి చెందిన ఒర్సు బంగారయ్య (45) అనే వ్యక్తిని రిమాండ్‌కు తరలించామన్నారు. వరంగల్ జిల్లా ముల్కనూర్‌కు చెందిన మరో వ్యక్తి పల్లెపు తిరుపతి పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి వద్ద జిలెటిన్ స్టిక్స్‌తోపాటు 8మీటర్ల పొడవు ఉన్న ఒక కార్డెక్స్ వైర్, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు బంగారయ్య తన అద్దె ఇంట్లో పేలుడుపదార్ధాలను ప్రమాదకరంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న సిరిసల్ల టౌన్ పోలీసులు వెంటనే చిన్నబోనాలకు వెళ్లి తనఖీ చేశారని, కంప్రెషర్ ట్రాక్టర్‌లోనూ, అద్దె ఇంట్లో నిల్వచేసిన జిలెటిన్ స్టిక్స్ పేల్చడానికి ఉపయోగపడే వైర్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ఎన్. ఉదయ్‌రెడ్డి, టౌన్ సీఐ బి.ఉపేందర్ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T01:12:57+05:30 IST