గర్రెపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలి
ABN, First Publish Date - 2023-07-06T23:53:19+05:30
మండలంలోని గర్రెపల్లి గ్రామాన్ని మండలంగా చేయా లని అఖిలపక్ష నేతలు మండల సాధన కమిటీగా ఏర్పడి గురువారం నిరాహార దీక్ష చేపట్టారు.
సుల్తానాబాద్, జూలై 6 : మండలంలోని గర్రెపల్లి గ్రామాన్ని మండలంగా చేయా లని అఖిలపక్ష నేతలు మండల సాధన కమిటీగా ఏర్పడి గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నేతలు తంగెళ్లపల్లి రాజ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం, సింగిల్‌విండో మాజీ చైర్మన్ కల్లెపల్లి జానీ, మాదా సు వెంకన్న, మహేష్‌గౌడ్, మాజీ సర్పంచ్ ఆసరి రాజయ్య, వెంకన్న, చక్రపాణి, మాజీ ఎంపీటీసీ వెంకటమ్మ, కన్న కొమురెల్లి, పత్రి అంజయ్య, పులి సంపత్ తదిత రులు పాల్గొన్నారు కాగా, మండల సాధన కోసం దీక్షలు చేపట్టిన వివిధ పార్టీల నేతలకు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం గర్రెపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గర్రెపల్లి ఎంపీటీసీ పులి అనూషతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, గర్రెపల్లి మాజీ సర్పంచ్ సత్యనారాయణరావు, బొల్లం లక్ష్మణ్ తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.
Updated Date - 2023-07-06T23:53:19+05:30 IST