ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్పాహారం కోసం...అందాలి సహకారం

ABN, First Publish Date - 2023-01-18T00:33:46+05:30

నూటికి నూరు శాతం సాధిం చ డమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతు లకు దాతల సాయం అవసరమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దాతల సాయం కోరుతున్న ఉపాధ్యాయులు

- జిల్లాలో 11 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు

జగిత్యాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నూటికి నూరు శాతం సాధిం చ డమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతు లకు దాతల సాయం అవసరమవుతోంది. పాఠశాల విద్యార్థులు పై చదు వులకు వెళ్లేందుకు పదో తరగతి తొలిమెట్టుగా భావిస్తుంటారు. పదో తర గతిలో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుంది. ఇందుకు ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు న్నారు. వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కా ర్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో పరి స్థితులు అనుకూలించడం లేదు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వ హించే సమయంలో ఉదయం, సాయంత్రం ప్రభుత్వం అల్పాహారం అం దించడం లేదు. ఇందుకు అవసరమైన ప్రత్యేక నిధులు పాఠశాలల్లో లేక పోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు సంఖ్య..

జిల్లా వ్యాప్తంగా 178 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 14 కేజీబీ వీలు, 13 ఆదర్శ పాఠశాలలు, 5 సోషల్‌ వెల్ఫేర్‌, 5 మైనార్టీ వెల్ఫేర్‌, 3 బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు ప్రతీ రోజు ఉదయం 8 గంటలకు వెళ్తుండగా ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ వారం ఒక్కో సబ్జెక్టుపై విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులు పలు పాఠ్యాంశాలను రివిజన్‌ చేయడంతో పాటు విషయ సంబంధ అ నుమానాలు నివృత్తి చేస్తూ సబ్జెక్టుపై పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఆకలి కారణంగా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు.

90 రోజుల ప్రణాళిక..

2023 మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 6 వేల పైచిలుకు విద్యార్థులను సంసిద్దు లను చేస్తున్నారు. విద్యాశాఖ 90 రోజుల కార్యాచరణ అమలు చేస్తోంది. ఈమేరకు నవంబరులో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఉద యం, సాయంత్రం వేళల్లో నిర్వహించే తరగతులు ఫిబ్రవరి వరకు కొన సాగనున్నాయి. డిసెంబరు చివరి వరకు రెగ్యులర్‌ పాఠ్యాంశాలను పూర్తి చేసి రివిజన్‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో విద్యాశాఖ సూచనల మేరకు స్లిప్‌ టెస్టులను సైతం నిర్వహిస్తున్నారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో నే జిల్లాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు అవసర మైన కృషి చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. అయితే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు అల్పాహారం లేకపోవడంతో నీరసించిపోతున్నారు.

దాతలు ముందుకు వస్తే..

పదో తరగతి విద్యార్థులకు అవసరమైన అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఇటీవల జగిత్యాలలో జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తదితరులు పిలుపునిచ్చారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు కొన్ని గ్రామాల్లో దాత లు స్పందించి అల్పాహారం అందిస్తున్నారు. అనేక గ్రామాల్లో విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహా యం అందిస్తే విద్యార్థులకు అల్పాహారం సమకూరే అవకాశాలుంటాయి. దీంతో విద్యార్థులు ఆకలి సమస్యను అదిగమించే అవకాశం ఉంది. త ద్వారా పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఉపాధ్యా యులు అంటున్నారు.

దాతలు ముందుకు రావాలి

- డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరముంది. యువజన సంఘాలు, ప్ర జాప్రతినిధులు, వ్యాపార సంస్థలు, స్వచ్చంద సంస్థలు, మహిళా సం ఘాలు ఇలా సమాజంలోని వివిధ వర్గాలు ప్రజలు స్పందించాలి.

ఉత్తమ ఫలితాలు సాధించేలా..

- జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి

పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు విద్యా శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. విద్యార్థులు ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహి స్తున్నాము. అయితే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా దాతల సాయం కోరుతున్నాము.

Updated Date - 2023-01-18T00:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising