ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలుగు నేలపై ఎన్నీల ముచ్చట్లది గొప్ప పాత్ర

ABN, First Publish Date - 2023-09-04T00:02:54+05:30

తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్నీల ముచ్చట్లు తెలుగు నేలపై గొప్ప పాత్ర పోషించాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌, కవి, కాలమిస్ట్‌ అల్లం నారాయణ అన్నారు.

కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 3: తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎన్నీల ముచ్చట్లు తెలుగు నేలపై గొప్ప పాత్ర పోషించాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌, కవి, కాలమిస్ట్‌ అల్లం నారాయణ అన్నారు. కరీంనగర్‌ ఫిలింభవన్‌లో ఆదివారం జరిగిన ఎన్నీల ముచ్చట్ల పదేళ్ల పండుగకు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా భావధారాప్రవాహం ఆగిపోకుండా ఎన్నీల ముచ్చట్లు చరిత్రాత్మక పాత్ర పోషిస్తున్నాయనన్నారు. ప్రజల పక్షాన నిలిచే కవులను, కవిత్వాన్ని బతికించడమే ఎన్నీల ముచ్చట్లని అన్నారు. పాత్రికేయుడు, కవి నగునూరి శేఖర్‌ పాటల రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పాట కూడా గొప్ప కవిత్వమేనని, అది ప్రజలను తొందరగా చేరుతుందన్నారు. కవి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డి మాట్లాడుతూ నలుగురినీ కలిపేవాడే గొప్ప కవి అన్నారు. హైదరాబాద్‌లో గతంలో తాము ద్వారక హోటల్లో ప్రతీ సాయంత్రం కవిత్వంతో కలుసుకొని ఉద్దీపన పొందేవారిమని గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ మాట్లాడుతూ అన్ని రకాల భావాలకు తెరవే వేదికగా నిలుస్తోందని, భాష, చరిత్ర, సంస్కృతుల పరిరక్షణ కోసం ఈ సంస్థ ఆవిర్భవించిందని అన్నారు. అనంతరం తెరవే మాజీ అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, కవి అన్నవరం దేవేందర్‌, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు, కవి జూకంటి జగన్నాథం, తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వేంకటేశ్వర్లు మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సీవి కుమార్‌ నివేదిక సమర్పించారు. సమన్వయకర్తలుగా తోట నిర్మలారాణి, దామరకుంట శంకరయ్య, పెనుగొండ బసవేశ్వర్‌, విలాసాగరం రవీందర్‌ వ్యవహరించారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు అల్లం నారాయణ, కె శివారెడ్డి ఎన్నీల ముచ్చట్ల పదేళ్ల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. పుస్తకాన్ని పుప్పాల శ్రీరాం సమీక్షించారు. కార్యక్రమంలో తెర వేదిక జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంజయ్య, ఈగల్‌ట్రస్టు అధ్యక్షుడు తంగెడ అశోక్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising