ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం

ABN, First Publish Date - 2023-06-26T00:35:45+05:30

స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను సన్మానిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 25: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేధావుల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1977 మార్చి 21వరకు ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి ప్రతికలను సెన్సార్‌ చేశారన్నారు. వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించిన పత్రికలపై తీవ్ర నిర్బంధం విధించారని, ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతునొక్కారని, ఎన్నో సంస్థలను రద్దు చేశారని విమర్శించారు. అనంతరం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన కోమల ఆంజనేయులు, కొమురవెల్లి సదానందం, మంతెన శ్రీమన్నారాయణ, జోగినిపల్లి సంపత్‌రావు, పలుకల రాజిరెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్లపు రమేశ్‌, పుల్లెల పవన్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, కల్లెం వాసుదేవరెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు, లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కల్యాణ్‌చంద్ర, ఎడమ సత్యనారాయణరెడ్డి, దళిత మోర్చ రాష్ట్ర అధికారప్రతినిధి జాడి బాల్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, కొమ్ము రవీందర్‌రెడ్డి, పురం హరి, మామిడి రమేశ్‌, లాల మురళి, రాగి సత్యనారాయణ, రాపాక ప్రవీణ్‌, కిన్నెర అనిల్‌, శ్రీను, వేణు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising