ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2023-05-26T00:29:37+05:30

ఆర్జీ-2 ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జీఎం మనోహర్‌ అధికారులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యైటింక్లయిన్‌కాలనీ, మే 25: ఆర్జీ-2 ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జీఎం మనోహర్‌ అధికారులకు సూచించారు. ఆవిర్భావ దినోత్సవ నిర్వహణపై గురువారం ముఖ్య అధి కారులతో జీఎం సమావేశం నిర్వహించారు. జూన్‌ 2న ప్రధాన ఉత్సవం జరిగే అబ్దుల్‌ కలాం స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయా లని, జీఎం ఆఫీస్‌తో పాటు అన్ని గనులు, డిపార్ట్‌ మెంట్లను అలంకరించాలని సూచించారు. గనులు, డిపార్ట్‌మెంట్లపై జాతీ య పతాకాల ను ఆవిష్కరించాలని సూచించారు. 27న ఉత్తమ గృహాల ఎంపిక, 29న మహిళలకు ముగ్గుల పోటీలు, 31న పాఠశాల విద్యార్థులకు క్విజ్‌ మరియు వ్యాసరచన పోటీలు, 2వ తేదీ ఉదయం షిర్కే చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి వందన సమర్పణ అనంతరం రన్‌ ఫర్‌ సింగరేణి ఉంటాయని అన్నారు. సాయంత్రం అబ్దుల్‌ కలాం స్టేడియంలో ప్రధాన ఉత్స వంలో ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, పోటీల్లో గెలిచిన వారి బహుమతుల ప్రదానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. విభాగాల వారిగా ఏర్పాట్లు, పోటీలను నిర్వహించాలని, అధిక సంఖ్యలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని జీఎం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్వో టూ జీఎం అబ్దుల్‌ సలీం, డీజీఎం పర్సనల్‌ రాజేంద్రప్రసాద్‌, అధికారులు ధనుంజయ, మురళీకృష్ణ, ధనలక్ష్మీబాయి, డాక్టర్‌ మహిపాల్‌, మాధవ రావు, సునీతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising