ఘనంగా దుర్గామాత బోనాలు
ABN, First Publish Date - 2023-09-04T00:08:10+05:30
గోదావరిఖనిలో రెల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల జాతరను నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, సెప్టెంబరు 3: గోదావరిఖనిలో రెల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల జాతరను నిర్వహించారు. స్థానిక హనుమాన్‌నగర్, లెనిన్‌నగర్‌ల నుంచి మహిళళు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని 2ఏ వంతెన వరకు ర్యాలీగా తరలివెళ్లి దుర్గామాతకు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో రెల్లి కులస్థులు దుర్గామా తకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మహిళలు, పిల్ల లు పెద్ద ఎత్తున బోనాలతో, శివసత్తులు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మేయర్ బంగి అనీల్ కుమార్ బోనాల ర్యాలీని ప్రారంభించగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, మనాలి దంపతులు దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్రజలకు దుర్గామాత ఆశీస్సులు ఉండగా, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాల రాజ్‌కుమా ర్, నాయకులు ధనాల దుర్గారావు, అడ్డాల రామస్వామి, డాక్టర్ చంద్రశేఖర్, ధనాల ప్రకాష్, శ్రీనివాస్, సింహాచలం, భూలోకం, లక్ష్మయ్య, ఈశ్వ ర్, బంగారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T00:08:10+05:30 IST