ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజకీయ లబ్ధి కోసమే నిధుల మళ్లింపు

ABN, First Publish Date - 2023-09-22T00:22:34+05:30

వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధిని విస్మరించిన సీఎం కేసీఆర్‌కు ఇక్కడి నిధులను మళ్లించే హక్కు లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌

వేములవాడ, సెప్టెంబరు 21: వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధిని విస్మరించిన సీఎం కేసీఆర్‌కు ఇక్కడి నిధులను మళ్లించే హక్కు లేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ అన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలోని ఆలయాల అభివృద్ధికి వేములవాడ దేవ స్థానం నుంచి ఐదు కోట్ల రూపాయల నిధు లను కేటాయించాలన్న దేవాదాయ శాఖ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్‌ దేవాలయాలను రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, ముంద స్తుగా దేవాలయాల నుంచి రాజకీయాలు మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అతిపెద్దదైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభి వృద్ధికి 400 కోట్ల రూపాయలు కేటాయిస్తానని హా మీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాల్సింది పోయి ఆలయ నిధులనే రాజకీయ లక్ష్యాలు నెర వేర్చుకోవడానికి గుడుల అభివృద్ధి పేరిట మళ్లిం చడం దౌర్భాగ్యం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశంపై పునరాలోచించి నిధుల మళ్లింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో అఖిలపక్షంతో కలిసి తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆది శ్రీనివాస్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులు సంద్రగిరి శ్రీనివాస్‌ గౌడ్‌, పిల్లి కనకయ్య, చిలుక రమేష్‌, కూరగాయల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising