ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబుల్‌’ ఇళ్ల సముదాయాల్లో సదుపాయాల కల్పనలో జాప్యం

ABN, First Publish Date - 2023-03-31T00:10:21+05:30

సిరిసిల్ల పట్టణంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయాల్లో జరుగు తున్న అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మూ షం రమేష్‌ అన్నారు.

పెద్దూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- సీపీఎం నాయకుల ఆరోపణ

సిరిసిల్ల రూరల్‌, మార్చి 30: సిరిసిల్ల పట్టణంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయాల్లో జరుగు తున్న అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మూ షం రమేష్‌ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూ ర్‌ శివారులో నిర్మించిన డబు ల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదా యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం సీపీఎం నాయకుల బృందం పర్యటిం చి పరిశీలించారు. ఈ సందర్భంగా మూషం రమేష్‌ మాట్లాడుతూ సిరిసిల్లలో 1804 మంది డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేశారన్నారు. కానీ ఇప్పటివరకు 1200 మందికి మాత్రవే ఇళ్లను అందించారన్నారు. మిగి లిన 600 మందికి సంబంధించి పెద్దూర్‌లో నిర్మించిన ఇళ్లలో మౌలిక సదుపాయాల నిర్మాణా లు జరగలేదని నిలిపివేశారన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా కలెక్టర్‌తోపాటు మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు స్పందించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పనులను వేగంగా పూర్తి చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్‌దాస్‌ గణేష్‌, నక్క దేవదాస్‌, బోగ కనుకయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising