ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన పంటల సాగు

ABN, First Publish Date - 2023-02-11T00:39:05+05:30

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం కొంతమేర పెరిగింది. జిల్లాలో గత యేడాదితో పోలిస్తే రైతులు, వరి, మొక్కజొన్న, నువ్వు, శనగలను ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. మరో వైపు ఆరుతడి పంటల జోలికి పోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భారీగా సాగైన వరి, మొక్కజొన్న, నువ్వు

- ఆరుతడిపై ఆసక్తి చూపని రైతులు

- మార్కెట్‌లో ఆశించిన ధర లేకపోవడమే కారణం

జగిత్యాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది యాసంగి సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం కొంతమేర పెరిగింది. జిల్లాలో గత యేడాదితో పోలిస్తే రైతులు, వరి, మొక్కజొన్న, నువ్వు, శనగలను ఎక్కువ మొత్తంలో సాగు చేశారు. మరో వైపు ఆరుతడి పంటల జోలికి పోలేదు. దీంతో ఆరు తడి సాగు విస్తీర్ణం పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం యాసంగి లో అన్నిరకాల పంటలు కలిపి సుమారు 2.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, 3.33 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు సాగు చేశారు. గత యేడాది యాసంగి సీజన్‌తో పోలి స్తే వేల ఎకరాల మేర పెరిగింది. వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురవ డంతో జలాశయాలు చెరువులు, కుంటలు నిండుకున్నాయి. భూగర్బ జలా లు సమృద్ధిగా ఉండడంతో బోర్లు, బావుల్లో ఆశించిన మేర నీరు ఉంది. దీంతో వరి, మొక్కజొన్న, నువ్వు పంటలు ఎక్కువగా సాగు చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కాలువల నుంచి పంటలకు సాగునీరు విడుదల కావడంతో పంటలు కళకళల్లాడుతున్నాయి.

జిల్లాలో గత యేడాది యాసంగి సాగు ఇలా..

జిల్లా వ్యాప్తంగా గత యేడాది యాసంగి సీజన్‌లో 2,72,632 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి పం ట 2,08,207 ఎకరాలు సాగు అయింది. మొక్కజొన్న 14,153 ఎకరాలు, గో దుమ 279 ఎకరాలు, చెరుకు 1,997 ఎకరాలు, జొన్న 764 ఎకరాలు, మ స్టర్డ్‌ 1,091 ఎకరాలు, నువ్వులు 29,202 ఎకరాలు, నల్ల పప్పు 5,258 ఎక రాలు, మిగిలిన వివిధ రకాల పంటలు 11,681 ఎకరాల్లో సాగు అయ్యాయి.

ప్రస్తుత యేడాది యాసంగిలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యేడాది యాసంగి సీజన్‌లో 3,33,320 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి పంట 2,94,482 ఎకరాలు సాగు అయింది. మొక్కజొన్న 27,550 ఎకరాలు, చెరుకు 561 ఎకరాలు, జొన్న 142 ఎకరాలు, మస్టర్డ్‌ 358 ఎకరాలు, నువ్వులు 7,982 ఎకరాలు, మిగిలిన వివిధ రకాల పంటలు 2,565 ఎకరాల్లో సాగు అవుతున్నాయి. జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది.

తగ్గిన ఆరుతడి సాగు

జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు పంటలకు డిమాండ్‌ ఉండడంతో మార్కెట్‌లో మంచి ధర వస్తోంది. దీంతో అత్యధికంగా ఇవే పంటలను రైతులు సాగు చేస్తున్నారు. గత యేడాది యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఆరు తడి పంటల సాగుకు ఆసక్తి కనపర్చడం లేదు. తద్వారా ఆ రు తడి పంటల సాగు విస్తీర్ణం గణ నీయంగా తగ్గింది. జొన్నలు, పప్పుది నుసులు, పొద్దు తిరుగుడు, వేరుశనగ తదితర పంటల సాగు క్షీణించా యి. మార్కెట్‌లో ఆరుతడి పంటల ధరలు నిలకడగా లేకపోవడంతో పా టు ప్రభుత్వం మద్దతు ధర కల్పించక పోవడం కూడా పంటలు సాగు చేయకపోవడానికి కారణమని అంటున్నారు. అలవాటుగా సులభంగా చే తికొచ్చే వరి, మొక్క పంటలను సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు.

అంచనాలకు మించి....

జిల్లాలో వరి పంట గత యేడాదితో పోలిస్తే ఎక్కువ సాగైంది. ఈ ఏడాది యాసంగిలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుం దని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటి వరకు 2,94,482 లక్షల ఎకరాల్లో రైతులు పంటను వేశారు. గత యేడాది కంటే ప్రస్తుత యేడాది జిల్లాలో 86,275 ఎకరాల్లో వరి పంట అధికంగా రైతులు సాగు చేస్తున్నా రు. దీనికితోడు జిల్లాలో సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. అంచనా కంటే దాదాపు 3.33 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతున్నాయి. జిల్లాలో 60 వేలకు పైగా విస్తీర్ణం పెరిగింది అదే విధంగా వానాకాలంలో మొక్కజొన్నకు మార్కెట్‌లో ధర ఎక్కువ రావడంతో రైతులు యాసంగిలో కూడా మొక్కజొన్నను గత యేడాది కంటే ఎక్కువ సాగు చేశారు. జిల్లాలో సుమారు 14 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని అంచ నా ఉంటే 27 వేలకు పైగా ఎకరాల్లో సాగైంది. అంచనా కంటే దాదాపు 13 వేల ఎకరాల విస్తీర్ణం మొక్కజొన్న పెరిగింది.

జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది

సురేశ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

గత యేడాది యాసంగి సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత యేడాది యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందులో వరి పంట సాగు గణనీ యంగా ఎక్కువైంది. జిల్లాలో ప్రతి పంట వివరాలను పక్కాగా సేకరి స్తున్నాము. యాసంగి సీజన్‌లో పంట నమోదు ప్రక్రియను పకడ్భందీగా నిర్వహిస్తున్నాము.

Updated Date - 2023-02-11T00:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising