గన్నేరువరం ఠాణాను తనిఖీ చేసిన సీపీ
ABN, First Publish Date - 2023-09-22T23:44:39+05:30
గన్నేరువరం పోలీసు ఠాణాను శుక్రవారం పోలీస్‌కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తనిఖీ చేశారు.
గన్నేరువరం, సెప్టెంబరు 22: గన్నేరువరం పోలీసు ఠాణాను శుక్రవారం పోలీస్‌కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తనిఖీ చేశారు. మొదట గన్నేరువరం ఎస్‌ఐ నర్సింహారావు సీపీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. పోలీసు ఠాణా ఆవరణలో మొక్క నాటారు. ఠాణాలోని వివిధ రికార్డులను సీపీ పరిశీలించారు. ఠాణా సిబ్బందితో మాట్లాడి రికార్డుల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. రాబోవు ఎన్నికల దృష్ట్యా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక యువకులతో మాట్లాడారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచి అలవాట్లను అలవరచుకుని, ఉన్నత శిఖరాలకు ఎదిగి ఆదర్శంగా నిలువాలన్నారు. క్రీడలు శారీరకంగానే కాకుండా మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువతకు పోలీసుకమిషనర్ చేతులమీదుగా క్రికెట్ కిట్‌లను ఇతర క్రీడా సామగ్రి అందించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ టి కరుణాకర్‌రావు, తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు నర్సింహారావు, ప్రమోద్‌రెడ్డి, రాజేష్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T23:44:39+05:30 IST