ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ రాజ్యాంగం

ABN, First Publish Date - 2023-09-22T00:24:45+05:30

రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలుకావడం లేదని బీఆర్‌ఎస్‌ రాజ్యాంగం కొనసాగుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంధిరాభవన్‌లో గురువారం జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 21: రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలుకావడం లేదని బీఆర్‌ఎస్‌ రాజ్యాంగం కొనసాగుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంధిరాభవన్‌లో గురువారం జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో చేస్తున్నామ ని ప్రజలకు భ్రమ కల్పించేందుకు బీసీ, మైనార్టీ, ధళితబంధు, గృహలక్ష్మి అంటూ ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి పథకాలను పూర్తిగా స్తభింప జేశారన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా కంప్యూటర్‌ డ్రా పద్ధతి చేపట్టామని చెబుతున్న మంత్రి కేటీఆర్‌ అది కేవలం హైదరాబాద్‌కే పరిమితమా అన్ని జిల్లాలకు వర్తించదా అనే సమా ధానం చెప్పాలన్నారు. 2022-23 బడ్జెట్‌లో ధళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించిన రూ.29,700 కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితబంధు పూర్తిగా ఎమ్మెల్యే బంధుగా మారిందన్నారు. దరఖాస్తులు స్వీకరించకుండా లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కలెక్టర్‌ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసినట్లుగా బాధ్యతలు పారద ర్శకంగా నిర్వహిస్తున్నారా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి తీసుకవెళుతామని అన్నారు. సమావేశంలో పీసీసీ సభ్యు డు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, పీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, నాయకులు గాజెంగి నందయ్య, గాజుల రాజేందర్‌, గుంటి జగదీశ్వర్‌, దేవేందర్‌ రెడ్డి, సిరాజోద్దీన్‌ మన్సూర్‌, కల్లెపెల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్‌, రాధాకిషన్‌ రావు, ధర రమేష్‌ బాబు, మునీందర్‌ రెడ్డి, వేణు, రాజిరెడ్డి, మధు ఉన్నారు.

Updated Date - 2023-09-22T00:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising