ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2023-03-02T00:26:40+05:30
ఛత్రపతి శివాజీని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని రా జ్యసభసభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.
ధర్మారం, మార్చి 1: ఛత్రపతి శివాజీని యువకులు ఆదర్శంగా తీసుకోవాలని రా జ్యసభసభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బుధవారం మండలంలోని కమ్మరిఖాన్ పేట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రా మకృష్ణారెడ్డి, కాసీపేట లింగయ్యలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ శివాజీ హైందవ సమాజం కోసం పోరాడాడన్నారు. ప్రతి గ్రా మంలో శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో యువకులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకుని విగ్రహాలను ఏర్పా టు సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి క న్నం అంజయ్య, సర్పంచ్ గుజ్జుల రమవేణుగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కాదా శీ శంకరమ్మమల్లేశం, బీజేపీ మండల అధ్యక్షుడు యాల్ల తిరుపతిరెడ్డి, నాయకులు మేడవేని శ్రీనివాస్, సందనేని లక్ష్మణ్ పాల్గొన్నారు. కమ్మరిఖాన్‌పేట ఎక్స్‌రోడ్డులో మహిళలు మంగళహారులు, యువకులు బైకుర్యాలీతో లక్ష్మణ్‌కు స్వాగతం పలికారు.
Updated Date - 2023-03-02T00:26:40+05:30 IST