ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ

ABN, First Publish Date - 2023-09-11T00:19:19+05:30

భూమి కోసం, భుక్తి కోసం, దోపిడి నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 10: భూమి కోసం, భుక్తి కోసం, దోపిడి నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. చాకలి ఐలమ్మ వర్దంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అన్నారు. తెలంగాణ పోరాట యోధులను రాష్ట్ర ప్రభుత్వం సమున్నత రీతిలో స్మరించుకుంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, కలెక్టర్‌ డాక్టర్‌ బి గోపి, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవో కె మహేశ్వర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెడ్డవేణి మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి, తెలంగాణ రజక సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు పూసాల సంపత్‌, సీపీఎం మిల్కూరి వాసుదేవరెడ్డి, రజక సంఘం నాయకులు కె శ్రీనివాస్‌, పెండ్యాల ప్రశాంత్‌, పూసాల శ్రీకాంత్‌, బిజిగిరి నవీన్‌, రాచకొండ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి అనిల్‌ ప్రకాశ్‌, ఆర్డీవో కె మహేశ్వర్‌, పూసాల సంపత్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

- తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పి, మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ శ్రేణులు కొనియాడారు. నగరంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలుర్పించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్‌ బాస సత్యనారాయణ, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు, నాయకులు మునిగంటి కుమార్‌, పొన్నాల రాము, ఉప్పరపల్లి శ్రీనివాస్‌, గుండారపు సంపత్‌, ఈసపెల్లి మహేష్‌, కొలిపాక అరవింద్‌, న్యాత ప్రవీణ్‌ పాల్గొన్నారు.

- చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణను పునఃనిర్మించుకోవాలని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీరాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాలులర్పించారు. కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్‌ పెద్దెల్లి శేఖర్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్‌గౌడ్‌, సూర్యారావు, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రజక సంఘాల వ్యవస్థాపక రా- అధ్యక్షుడు పూసాల సంపత్‌ అన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాపాల శంకర్‌, భూసాల శ్రీకాంత్‌, మడక సంపత్‌, పెండ్యాల ప్రశాంత్‌, శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-11T00:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising