ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2023-02-07T00:22:04+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలను మోసం చేసి మరో సారి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ప్రజలకు సూచించారు.

హాత్‌సే హాత్‌ యాత్ర నిర్వహిస్తున్న మక్కాన్‌ సింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- హాత్‌సే హాత్‌ జోడో యాత్రలో డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని, ఫిబ్రవరి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలను మోసం చేసి మరో సారి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ప్రజలకు సూచించారు. సోమవారం గోదావరిఖనిలో టీపీసీసీ పిలుపు మేరకు హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గాంఽధీ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషిని, సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. రైతులు, కౌలు రైతుల కోసం వరంగల్‌లో రైతు డిక్లరేష్‌ సభలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలిస్తే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఓసీపీ ప్రాజెక్టులు రాకుండా కుర్చీ వేసుకుంటానని కూర్చుంటానని చెప్పిన ముఖ్యమంత్రి రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని, ఓసీపీ5తో రామగుండం స్మశానంగా మారిందని, దుమ్ము, దూళితో ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉపాధి అవకాశాలు లేక విలవిలలాడుతున్నారన్నారు. మొదటి రోజు ఈ జోడో యాత్ర రామగుండం కార్పొరేషన్‌లోని 31, 50 డివిజన్‌లలో నిర్వహించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, గాదం విజయ, ఎండీ ముస్తాఫా, పెద్దెల్లి తేజస్విని, నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్‌, గట్ల రమేష్‌, తాళ్లపల్లి యుగంధర్‌, చుక్కల శ్రీనివాస్‌, పాతిపెల్లి రవి, నాజీమోద్దీన్‌, ఉమ్మెత్తుల దేవేందర్‌రెడ్డి, ఫజల్‌ బేగ్‌, దొబ్బల శ్రీనివాస్‌, తిప్పారపు శ్రీనివాస్‌, కొలని వెంకటరెడ్డి, మహ్మద్‌, ఆసిఫ్‌ పాషా, స్వప్న, ఎంచర్ల మహేష్‌, దాసరి విజయన్‌, కౌటం సతీష్‌, పీక అరుణ్‌కుమార్‌, డివిజన్‌ అధ్యక్షులు, నాయకులు పాల్గొనారు.

Updated Date - 2023-02-07T00:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising