ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ జెండా పండగ

ABN, First Publish Date - 2023-04-19T23:58:42+05:30

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ గ్రామాన జెండా పండగ నిర్వహించి మరోసారి బీఆర్‌ఎస్‌ గులాబీ జెండాలను ఎగురవేయాలని భావిస్తున్నది.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ గ్రామాన జెండా పండగ నిర్వహించి మరోసారి బీఆర్‌ఎస్‌ గులాబీ జెండాలను ఎగురవేయాలని భావిస్తున్నది. ఈ నెల 25న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాలకు మూడు వేల నుంచి ఐదు వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా చూసుకోవాలని, సమావేశం తేదీ నాటికి గ్రామాల్లో వాడవాడలా జెండా గద్దెలు నిర్మించి గులాబీ జెండాలను ఎగురవేయాలని నిర్ణయించింది. నియోజకవర్గ సమావేశాల అనంతరం ఈ నెల 27న హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మరోసారి ప్రజల్లోకి వెళ్లడానికి ఈ జెండా పండగ తోడ్పడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.

ఫ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గ స్థాయి సమావేశాలను, జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులకు, జిల్లాల అధ్యక్షులకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ నియోజకవర్గాల సమావేశాల నిర్వహణపై బుధవారం సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఊరూరా, వాడవాడలా జెండా గద్దెల నిర్మాణం చేపట్టి వెంటనే పూర్తి చేయాలని, ఈ నెల 25న అన్ని మున్సిపాలిటీ వార్డుల్లో, గ్రామాల్లో వీధుల్లో గులాబీ జెండాలను ఎగురవేసి కార్యకర్తలందరు నియోజకవర్గస్థాయి సమావేశానికి హాజరయ్యేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు సమన్వయంతో కార్యకర్తలను సమావేశాలకు హాజరయ్యేలా చూసి విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్‌ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని రాజశ్రీ గార్డెన్‌లో, మానకొండూర్‌ నియోజకవర్గ సమావేశాన్ని సుప్రీం ఫంక్షన్‌హాల్‌లో, చొప్పదండి నియోజకవర్గ సమావేశాన్ని గంగాధర మండల కేంద్రంలోని బీఏఎస్‌ గార్డెన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ సమావేశాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కార్యకర్తలందరికి భోజనాల ఏర్పాట్లను కూడా పార్టీ నాయకత్వం ఏర్పాటు చేస్తున్నది. సమావేశాలకు గ్రామ, వార్డు బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరవుతారని పార్టీ నాయకత్వం తెలిపింది. ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తలకు దగ్గరగా వెళ్లిన నాయకత్వం ఆవిర్భావ దినోత్సవంతో మరింత దగ్గరై కొత్త ఉత్సాహాన్ని నింపి ఎన్నికలకు సమాయత్తం చేయాలని ఆ పార్టీ భావిస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రతి కార్యకర్త గుండెనిండా గులాబీజెండా కొలువై ఉన్నదని, మరోసారి ఈ జెండాలను ఊరూరా, వాడవాడలా ఎగరవేసి గ్రామాల్లో జెండా పండగ నిర్వహించాలని ఆయన కోరారు.

ఫ హుజూరాబాద్‌ ఇన్‌చార్జిగా పాడి కౌశిక్‌రెడ్డి

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఆయా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా ఉండగా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని పార్టీ మరోసారి స్పష్టం చేసినట్లయింది.

Updated Date - 2023-04-19T23:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising