ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మతోన్మాదాన్ని సృష్టిస్తున్న బీజేపీ

ABN, First Publish Date - 2023-09-18T00:52:41+05:30

భూమి, భుక్తి, పీడిత జన విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి అనుబంధం లేని బీజేపీకి మాట్లాడే హక్కులేదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి మతోన్మాదాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య అన్నారు.

సిరిసిల్లలో మాట్లాడుతున్న వీరయ్య

సిరిసిల్ల రూరల్‌, సెప్టెంబరు 17 : భూమి, భుక్తి, పీడిత జన విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి అనుబంధం లేని బీజేపీకి మాట్లాడే హక్కులేదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి మతోన్మాదాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌లో ఆదివారం రాత్రి సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట విలీన వారోత్సవాల ముంగిపు బహిరంగ సభను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ అధ్యక్షుత నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ప్రజలు ఇప్పటికైన మేల్కోవాలని, కమ్యూనిస్టులే భూసాము లకు ఘోరీ కట్టారని అన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే 10లక్షల ఎకరాల భూములను భూస్వా ముల నుంచి గుంజుకొని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకల ధరలతో పాటు డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. బీజేపీ పాలనపై సీఎం కేసీఆర్‌ చేసిన యుద్ధాన్ని నిలిపివేయడం సరికాదని, మళ్లీ ఆ యుద్ధాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు, శాంతి ప్రకాష్‌ శుక్లా, జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జివ్వాజి విమల, వీర్నపల్లి ఎంపీటీసీ మల్లారం అరుణ్‌కుమార్‌, సుద్దాల ఉపసర్పంచ్‌ ఎరవెళ్లి నాగరాజు, అన్నల్‌దాస్‌ గణేష్‌, ఎలిగేటి రాజశేఖర్‌, మాల్లారపు ప్రశాంత్‌, సూరం పద్మ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వీర్నపల్లి: భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన మహోన్నత ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లారపు అరుణ్‌కుమార్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం (మర్క్సిస్ట్‌), సీఐటీయూ ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను ఆదివారం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటుకు నరేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్‌కుమార్‌, హమాలీ సంఘం మండల అధ్యక్షుడు రాజేశం, భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షుడు రాజం పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T00:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising