ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు బీజేపీ కుట్ర

ABN, First Publish Date - 2023-02-21T00:29:23+05:30

సింగరేణి సంస్థను ప్రైవేట్‌ పరం చేసేందుకు బీజేపీ ప్రభు త్వం కుట్ర చేస్తున్నదని, ఆ కుట్రలను భగ్నం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ పార్టీ బూత్‌ కమిటీల సమావేశం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధ్యక్షతన సోమవారం జరిగింది.

మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థను ప్రైవేట్‌ పరం చేసేందుకు బీజేపీ ప్రభు త్వం కుట్ర చేస్తున్నదని, ఆ కుట్రలను భగ్నం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ పార్టీ బూత్‌ కమిటీల సమావేశం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవు తున్నాయని, కేసీఆర్‌ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నా రు. ప్రజలంతా బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని తెలిపా రు. సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అన్నారు. దేశ సంపదను అదానీ లాంటి వారికి కట్టబెట్టేందు కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని విమర్శించారు. సింగరేణి బొగ్గు గాకుండా అదాని గనుల నుంచే అడ్డగోలు ధరలకు బొగ్గును కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాయడాన్ని చూస్తే మోదీ ఎవరిని బాగు చేసేందుకు పని చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నా రు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందు పదేళ్లు పాలించి న కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోవడానికి ఎలాంటి అభివృ ద్ధి పనులు లేవని, వాళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన ను విమర్శించడం ఏమిటని ప్రశ్నిం చారు. రాష్ట్రం లో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్త లు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చే యాలన్నారు. అందరు సమన్వయంతో పార్టీ బలో పేతానికి కృషిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జడ్పీచైర్మన్‌ పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రతీ ఒక్కరికి వివరించాలని, ప్రతిపక్షాల విమర్శల ను తిప్పికొట్టాలని అన్నారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, రామగుండంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మే యర్‌ అభిషేక్‌రావు, మూల విజయారెడ్డి, తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising