ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు

ABN, First Publish Date - 2023-02-05T00:16:26+05:30

రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాల ల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాల ల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్‌ దర్గా మండల పరిషత్‌ పాఠశాలలో 25.07 లక్షల వ్యయంతో మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి- శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో పేదవారు ఎక్కువ ఉంటారని చెప్పారు. వారికి ఇబ్బందులు కలుగకంఉడా పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠఽశాలల్లో వసతులు కల్పిస్తున్నామన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రయివేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు మెరుగైనా వసతులు కల్పించడానికి ముఖ్య మంత్రి ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమం కింద జిల్లాలో మొదటి దశలో 191 పాఠశాలలో 12 రకాల పనులు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆడెపు వెంకటేషం, పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,ఎస్‌ఎంసీ చైర్మన్‌ సదయ్య, జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, తహసీల్దార్‌ వెంకటలక్ష్మీ, ఎంపీడీవో రాజు, జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి మైఖేల్‌ బోస్‌, ఎంపీవో సుదర్శన్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ మధన్‌ మోహన్‌, ఏంఈవో సురేంద్రకుమార్‌ తదితదరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T00:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising