ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ రుణాలు ఎప్పుడో..?

ABN, First Publish Date - 2023-02-25T00:36:15+05:30

బీసీ రుణాలు అందుకోవడానికి నిరుద్యోగులకు సంవత్సరాల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నాలుగేళ్లుగా తప్పని ఎదురుచూపులు

- జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తుల పెండింగ్‌

జగిత్యాల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): బీసీ రుణాలు అందుకోవడానికి నిరుద్యోగులకు సంవత్సరాల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. స్వయం ఉపాధి రుణాల పంపిణీ కొరకు ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు బుట్టదాఖలువుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు ఎలా గూ అందకపోవడంతో కనీసం స్వయం ఉపాధితో జీవనం గడుపుదా మ ని భావించిన బీసీ వర్గాల యువత నిరాశకు గురికావాల్సి వస్తోంది. జగి త్యాల జిల్లాలో బీసీ కార్పోరేషన్‌, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చే సుకున్న వారి సంఖ్య దాదాపుగా 15 వేలకు పైగానే ఉంది. జనాభాలో సగభాగమున్న బీసీల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని, బ డుగు, బలహీన వర్గాల సమగ్రాభివృధ్ధే ధ్యేయమని, కుల వృత్తులకు పె ద్దపీట వేస్తామని, సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని పలు వేదికలపై ప్రజాప్రతినిధులు చెపుతున్న మాటలు నీటి మూటలుగా మా రుతున్నాయి. నాలుగేళ్లుగా బీసీ కార్పోరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాల జాడే లేకుండా పోయింది. ఫెడరేషన్‌ పరిస్థితి దాదాపుగా అదే తీరుగా మారిం ది. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు.

జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు ..

జిల్లాలో బీసీ కార్పొరేషన్‌, ఫెడరేషన్‌ల ద్వారా రుణాలను పొందడానికి గత నాలుగేళ్లుగా 15,162 మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నా రు. నిరుద్యోగులకు ప్రభుత్వం కేటాగిరి - 1 కింద రూ. లక్షలోపు, కేటగిరి - 2 కింద రూ. 2 లక్షలలోపు, కేటగిరి - 3 కింద రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల్లోపు రుణాలను అందిస్తారు. జగిత్యాల జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ కింద 8,583 మంది నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకు న్నారు. ఇందులో కేటాగిరి -1 కింద 2,072 దరఖాస్తులు, కేటాగిరి- 2 కింద 3,512 దరఖాస్తులు, కేటగిరి - 3 కింద 2,999 దరఖాస్తులు చేసుకున్నారు.

బీసీ ఫెడరేషన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు..

జిల్లాలో బీసీ ఫెడరేషన్‌ ద్వారా 6,579 మంది నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో కేటాగిరి - 1 కింద 1,796 మంది, కేటాగిరి 2,835 మంది, కేటగిరి- 3 కింద 1,948 మంది ని రుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం బీసీ కార్పోరేషన్‌, ఫెడరేషన్‌ కింద జిల్లాలో 2017-18 సంవత్సరంలో చివరిసారిగా 1,503 మంది నిరుద్యోగులకు మాత్రమే రుణాలు అందిం చారు. మిగితా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రుణాలను అందించాల్సి ఉంది. 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క రికైనా రుణాలను అందించిన దాఖాలలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలోనైనా రుణాలు అందుతాయన్న ఆశతో నిరుద్యోగులు ఎదురుచూ స్తున్నారు. అధికారులు ఏ యేటికి ఆ యేడు బీసీ రుణాలను అందించడా నికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నప్పటికీ నిధు లు విడుదల కావడం లేదని నిరుద్యోగ యువత ఆరోపిస్తోంది. ఇప్పటి కైనా ప్రభుత్వం బీసీ రుణాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.

బీసీ నిరుద్యోగులకు ఉపాధి రుణాలు అందించాలి

నాంపల్లి గట్టయ్య, బీసీ సంక్షేమ సంఘ నాయకుడు

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గగనంలా మారింది. ప్రభుత్వం స్వయం ఉపాధికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముంది. బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు అవసరమైన రుణాలను అందించాలి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది

సాయిబాబా, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి, ఇన్‌చార్జి మైనార్టీ అభివృద్ధి అధికారి

జిల్లాలో బీసీ కార్పొరేషన్‌, ఫెడరేషన్‌ ద్వారా రుణాలను అందించడానికి ఆసక్తి గల యువతీ యువకుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాము. దరఖాస్తుల పరిస్థితిని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిం చాము. రుణాల పంపిణీకి అవసరమైన నిధుల మంజూరు కావాల్సి ఉంది.

Updated Date - 2023-02-25T00:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising