ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకే బీసీ బందు పథకం

ABN, First Publish Date - 2023-08-12T00:47:57+05:30

రాష్ట్రంలో బీసీలు అర్థిక అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బందు పథకాన్ని ప్రవేశ పెట్టి అందిస్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కటకం సంఘయ్య కళ్యాణ భవ నంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దివాకర్‌తో కలిసి నియో జకవర్గంలోని 300 మంది లభ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

కోరుట్ల, ఆగస్టు 11 : రాష్ట్రంలో బీసీలు అర్థిక అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బందు పథకాన్ని ప్రవేశ పెట్టి అందిస్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కటకం సంఘయ్య కళ్యాణ భవ నంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దివాకర్‌తో కలిసి నియో జకవర్గంలోని 300 మంది లభ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వివిధ మండలాలకు చెందిన లభ్దిదారులు మండల స్థాయి నాయకులతో కలిసి అదనపు కలెక్టర్‌ దివాకర్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్‌ రావును సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అర్థిక అభివృద్ధి చేందేందుకు పలు పథకాలను ప్రవేశ పెట్టి అందిస్తోందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం ముఖ్య మంత్రి కేసీఆర్‌ అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి ప్రచారాన్ని వచ్చే ఎన్నిక ల్లో తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు అన్నం లావణ్య-అనిల్‌, సుజాత-సత్యనారాయణ, కోరుట్ల, మె ట్‌పల్లి ఎంపీపీలు తోట నారాయణ, మారు సాయిరెడ్డి, జడ్‌పీటీసీ సభ్యు రాలు దారిశెట్టి లావణ్య-రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌లతో పా టు పలువురు పాల్గొన్నారు.

ప్రజలకు మరింత చేరువలో ఆరోగ్య సేవలు

ప్రజలకు మరింత చేరువలో ఆరోగ్య సేవలు అందించడానికి మున్సి పల్‌ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య సబ్‌ కేంద్రాల నిర్మాణం ఏర్పాట్లును రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. శు క్రవారం పట్టణంలోని ఎసీకోని గుట్ట, కల్లూర్‌ రోడ్డు, 17వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య సబ్‌ సెంటర్ల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్యతో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరోగ్య సమస్యల పరిష్కా రానికి రాష్ట్ర మంత్రి హరీష్‌రావు నిరంతరం కృషి చేస్తున్నాడని అన్నారు. కార్పొరేట్‌ వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందే విధంగా రాష్ట్ర మం త్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ గడ్డమీది పవన్‌, కౌ న్సిలర్లు గందం గంగాధర్‌, సంగ లింగం, ఎంబేరీ నాగభూషణం, సునిల్‌, సజ్జు, మోర్తాడ్‌ లక్ష్మినారాయణ, నాయుకులు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-12T00:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising