ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలి

ABN, First Publish Date - 2023-06-01T00:04:58+05:30

బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలని, ప్రభుత్వ పథకాలతోపాటు పీఎంఎఫ్‌ఎంఈ, పాడిగేడెల గ్రౌండింగ్‌కు సహక రించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు.

బ్యాంకర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 31: బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలని, ప్రభుత్వ పథకాలతోపాటు పీఎంఎఫ్‌ఎంఈ, పాడిగేడెల గ్రౌండింగ్‌కు సహక రించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రుణాలతోపాటు ఎంఎస్‌ఎంఈ కింద ఎక్కువ రుణాలు మంజూరు చేయా లని ఆదేశించారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన మిల్చి పాడిగేదెల పథకం కింద ఇంకా మిగిలిన యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాల న్నారు. అంతకుముందు జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌ గతేడాది బ్యాం క్‌లు చేసిన ఫర్మామెన్స్‌ను వివరించడంతో పాటు రుణాల లక్ష్యం రూ.2725 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.2579 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. యూనియన్‌ బ్యాంక్‌ ప్రాంతీయ అధికారి ఎంఎస్‌ అపర్ణారెడ్డి, ఆర్‌ బీఐ ఎల్‌ డీవో దేబాజీ, నాబార్డు డీడీఎం జైపాల్‌, కేడీసీసీ సీఈవో సత్య నారాయణ, ఎస్‌బీఐ సీఎం అంజనేయులు, బ్యాంక్‌ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising