కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ
ABN, First Publish Date - 2023-09-04T00:03:53+05:30
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
పెద్దపల్లి రూరల్, సెప్టెంబరు 3: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం మండలంలోని భోజ న్నపేటలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో ఇంటింటా పాదయాత్ర నిర్వహించా రు. ఈసందర్భంగా ఇంటింటా తిరుగుతూ సమస్యలు అడిగితెలుసుకున్నారు. అనం తరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చాక పేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఎస్పీ కులస్థులకు రూ.6లక్షలతో ఇంటిస్థలాన్ని అందిస్తామ న్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సమకూరుస్తామన్నారు. బీఆర్‌ఎస్, బీజే పీ ప్రభుత్వాలు గ్యాస్,పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచి పేదల ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్, సుధాకర్‌రెడ్డి, రంగు రమేష్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి, రమేష్, చిట్టవేన శ్రీని వాస్, కల్వల సరేందర్, కాల్వ సదానందం, కునారపు సతీష్, రమేష్, గడ్డం ఉదయ్, రెడ్డిమల్ల రమేష్, వంగ కొమురయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T00:03:53+05:30 IST