శిలాఫలకం వేశారు.. పనులు మరిచారు
ABN, First Publish Date - 2023-03-23T01:00:17+05:30
మండలంలోని కలికోట సూరమ్మ కుడి, ఎడమ కాలువ పనుల కోసం ఐదేళ్ల క్రితం శిలాఫలకం వేసి పనులు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సూరమ్మ’ పనులపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
కథలాపూర్, మార్చి 22 : మండలంలోని కలికోట సూరమ్మ కుడి, ఎడమ కాలువ పనుల కోసం ఐదేళ్ల క్రితం శిలాఫలకం వేసి పనులు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కథలాపూర్‌లో శిలాఫలకానికి కుడుకల పేరు వేసి నిరసన తెలిపారు. ఈ కొత్త ఏడాదిలోనైనా సూరమ్మ పనులకు శుభం కలగుతుందనే ఆశాభావంతో నిరసన చేపట్టామని పేర్కొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018లో అప్పటి నీటిపారుదల శాఖామంత్రి హరీశ్‌రావు శిలాఫలకం వేసి దసరాలోపు సూరమ్మకు నీళ్లు తెస్తామని నమ్మించి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నా రన్నారు. మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లోని సుమారు 45 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తేవాలని కుడి, ఎడమ కాలు వలు తవ్వాలని నిర్ణయించారన్నారు. దీనికి రూ. 204 కోట్ల నిధులు విడు దల చేశామని చెప్పుకుని రైతులకు కుచ్చుటోపి పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అజీం, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు అల్లకొండ లింగంగౌడ్, జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్‌రెడ్డి, పులి హరిప్రసాద్, ఎగ్యారపు శ్రీహరి, కల్లెడ శంకర్, శంకర్, సత్యనారాయణ , శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-03-23T01:00:17+05:30 IST