27వేల టన్నుల యూరియా సరఫరా చేయాలి
ABN, First Publish Date - 2023-06-26T23:47:02+05:30
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణ జిల్లాలకు జూన్ మాసంలో 27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు పేర్కొన్నారు.
- వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు
కోల్‌సిటీ, జూన్ 26: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణ జిల్లాలకు జూన్ మాసంలో 27వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఫర్టిలైజర్స్, జేడీఏ రాములుతో కలిసి ఆయన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సందర్శించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోని ప్రొడక్షన్, మార్కెటింగ్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు పరిశ్రమలో సాంకేతిక లోపాల వల్ల 15రోజులు ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో అనుకున్న సరఫరా చేయలేకపోయామని పేర్కొన్నారు. పరిశ్రమ ఉత్పత్తి దశలో ఉన్నందు వల్ల ఈ మాసంలో 27వేల టన్నుల యూరియా సరఫరా చేయాలని, జూలై, ఆగస్టు మాసంలో వ్యవసాయ అవసరాలకు యూరియా అధికంగా వినియోగం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సప్లై ప్లాన్ ప్రకారం సరఫరా చేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట అగ్రికల్చర్ ఏడీఈ గోమ ఆదిరెడ్డి, అధికారులు శ్రీనాథ్, కాంతారావు, ఆర్‌ఎఫ్‌సీఎల్ హెచ్‌ఆర్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:47:02+05:30 IST