‘జయ’ పాఠశాల విజయకేతనం
ABN, First Publish Date - 2023-05-11T01:01:00+05:30
జిల్లా కేంద్రంలోని జయ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 47 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి, ప్రతిభ కనబరిచారు.
భానుపురి, మే 10: జిల్లా కేంద్రంలోని జయ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 47 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి, ప్రతిభ కనబరిచారు. అదే విధంగా 9.8 జీపీఏ 41 మంది, 9.7 జీపీఏ 27 మంది, 9.5 జీపీఏ 31 మం ది సాధించి ఉత్తీర్ణులయ్యారని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయు లు, సిబ్బంది అభినందించారు.
Updated Date - 2023-05-11T01:01:00+05:30 IST