ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతసామరస్యానికి ప్రతీకగా జాన్‌పహాడ్‌ దర్గా

ABN, First Publish Date - 2023-01-22T00:35:48+05:30

మతసామరస్యానికి ప్రతీకగా జాన్‌పహాడ్‌ సైదులు దర్గా విరాజిల్లుతోం ది. మండలంలోని జాన్‌పహాడ్‌ సైదులు దర్గాకు రాష్ట్రంతోపాటు, ఏపీ రాష్ట్రంలో సైతం ప్రతేక గుర్తిం పు ఉంది. నేరేడుచర్ల మండల కేంద్రానికి 25కి.మీ దూ రంలో, పాలకవీడు మండల కేంద్రానికి 13 కి.మీ దూరంలో, నల్లగొండ జిల్లా దామరచర్ల మండ ల కేంద్రానికి 9కి.మీ దూరంలో ఈ దర్గా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

26 నుంచి మూడు రోజులపాటు ఉర్సు ఉత్సవాలు

పాలకవీడు: మతసామరస్యానికి ప్రతీకగా జాన్‌పహాడ్‌ సైదులు దర్గా విరాజిల్లుతోం ది. మండలంలోని జాన్‌పహాడ్‌ సైదులు దర్గాకు రాష్ట్రంతోపాటు, ఏపీ రాష్ట్రంలో సైతం ప్రతేక గుర్తిం పు ఉంది. నేరేడుచర్ల మండల కేంద్రానికి 25కి.మీ దూ రంలో, పాలకవీడు మండల కేంద్రానికి 13 కి.మీ దూరంలో, నల్లగొండ జిల్లా దామరచర్ల మండ ల కేంద్రానికి 9కి.మీ దూరంలో ఈ దర్గా ఉంది. ముస్లింల దర్గా అయినా ఇక్కడికి 80 శాతం మంది హిందువులే వస్తుంటారు. జాన్‌పాక్‌ షహీద్‌ కాలక్రమేనా జాన్‌పాక్‌ సైదాగా, జాన్‌పహాడ్‌ సైదులుగా పేరొందారు. ఇక్కడ ఏటా జనవరి చివరి శుక్రవారం రోజున ఉర్సు ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజు లు కొనసాగుతాయి.

జాన్‌పహాడ్‌లో సైదులు దర్గాను భక్తులు దర్శించుకొని మొక్కు తీర్చుకుంటారు. అదేవిధంగా గొల్లభామ శిల అయిన ప్రదేశాన్ని గొల్లభామ గుట్టగా భావించి ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కడ నమస్కరించి, తలా ఒక రాయి విసిరి వెళ్తుంటారు. అందేవిధంగా సైదులు బాబా సేనానికి ఇక్కడ ప్రత్యేక సమాధి ఉంది. ఆయన సమాధి చుట్టూ పలువురు సైనికుల సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తు లు సేనాని సమాధి చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. కోర్కెలు తీరితే ఇక్కడికి వచ్చి కం దూరు చేసి తాళం తీస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడ నాగేంద్రుడి పుట్ట సైతం ఉం ది. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే నాగేంద్రుడిని ఇక్కడికి వచ్చే ముస్లిం భక్తులు కూడా పూజించడం విశేషం. నాగేంద్రుడి పుట్ట ఉన్న చెట్టు కు ముడుపులు కట్టి మొక్కు చెల్లించుకుంటా రు. ప్రతీ శుక్రవారం ఇక్కడ భక్తులు కందూరు పేరుతో మొక్కు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీరుతే గొర్రెపోతులు, మేక పోతులు, కోళ్లు బలిచ్చి భక్తులు మొక్కు చెల్లించుకుంటారు.

ఏటా ఉర్సు ఉత్సవం

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద ఏటా సంక్రాంతి పండుగ వెళ్లాక అమావాస్య అనంతరం వచ్చే శుక్రవారం నాడు ఉర్సు నిర్వహిస్తారు. ఈ ఉర్సు సందర్భంగా హైదరాబాద్‌ నుంచి గంధాన్ని దర్గాకు తీసుకు వచ్చి ఊరేగింపు నిర్వహిస్తారు. గంధాన్ని దర్గాలో ఉంచి భక్తులకు వితరణచేస్తారు. గంధం ఊరేగింపులో రాష్ట్రంతోపాటు, ఏపీ రాష్ట్రం నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడి వస్తారు.

వసతుల కల్పనలో వక్ఫ్‌బోర్డ్‌ విఫలం

జాన్‌పహాడ్‌ దర్గాకు ఏటా కాంట్రాక్టుల పేరుతో కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్‌బోర్డ్‌ విఫలమైంది. ఉర్సు సందర్భంగా దక్కన్‌ సి మెంట్స్‌ యాజమాన్యం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. అది తప్ప బోర్డు తాగునీటి వసతి కల్పించ లేకపోయింది. కనీస సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

60 ఏళ్లుగా ఉర్సుకు వస్తున్న : సురభి నారాయణ, ఖమ్మం జిల్లా, తల్లాడ గ్రామం

నాకు 90 ఏళ్లు. 60ఏళ్లుగా ఏటా ఉర్సు ఉత్సవానికి వస్తున్నా. గొల్ల భామ అమ్మ వారు కలలోకి రావడంతో గతంలో ఇక్కడ గుడి నిర్మాణానికి కృషిచేశా. ఏటా గొల్లభామ గుడిని దర్శించుకుంటా. ఉర్సు మూడు రోజులపాటు ఇక్కడే ఉండి గొల్లభామ గుడి వద్ద సేవ చేస్తా. ప్రభుత్వం దృష్టిసారించి గొల్లభామ గుడిని అభివృద్ధి చేయాలి.

హోంమంత్రికి ఉర్సు ఆహ్వాన పత్రిక అందజేత

పాలకవీడు, జనవరి 21: జాన్‌పహాడ్‌లో ఈ నెల 26, 27, 28తేదీల్లో నిర్వహించే దర్గా ఉర్సుకు రావాల్సిందిగా హోంమంత్రి మహమూద్‌ అలీకి దర్గా పూజారి జాని శనివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. హైదరాబాద్‌ ఆయన్ను కలిసి గంధం ఊరేగింపు, ప్రత్యేక పూజా కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

Updated Date - 2023-01-22T00:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising