ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IR and PRC : ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్సీ!

ABN, First Publish Date - 2023-09-21T02:21:51+05:30

ఎన్నికల వేళ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు శుభవార్త చెబుతుందా? త్వరలో వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా? మధ్యంతర భృతి(ఐఆర్‌), పెండింగ్‌లో ఉన్న మూడు కరువు భత్యాల్లో(డీఏ) ఒకదాన్ని విడుదల చేసే

త్వరలో క్యాబినెట్‌ భేటీ.. అందులోనే ఐఆర్‌కు ఆమోదం..

పీఆర్సీకి పలువురు ఐఏఎస్‌ల పేర్ల పరిశీలన

12-20ు మధ్యలో మధ్యంతర భృతి?..

మూడింటిలో ఒక డీఏ ప్రకటనకు చాన్స్‌!

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్కారు శుభవార్త చెబుతుందా? త్వరలో వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా? మధ్యంతర భృతి(ఐఆర్‌), పెండింగ్‌లో ఉన్న మూడు కరువు భత్యాల్లో(డీఏ) ఒకదాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి, ఇతర అంశాలను చర్చించడానికి 29న క్యాబినెట్‌ సమావేశం జరగనుందని పేర్కొంటున్నాయి. నిజానికి ఉద్యోగుల పీఆర్సీపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. జూలై 1 నుంచే ఉద్యోగులకు వేతనాలు పెరగాలి. అంతకు ముందే పీఆర్సీని ఏర్పాటు చేసి, ఫిట్‌మెంట్‌పై సిఫారసులను చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించాలి. మూడు నెలలు గడుస్తున్నా.. ఆ దిశలో అడుగులు ముందుకు పడలేదు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన రేపుతున్న తరుణంలో-- ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ పీఆర్సీ, ఐఆర్‌పై ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ‘‘మా ఉద్యోగులు చాలా చెమటోడుస్తున్నారు. ఉద్యోగులే కష్టపడి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నారు. అందుకే.. వారు తెచ్చే రెవెన్యూలో కొంత వాటా ఇస్తాం. దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉద్యోగులకు పేస్కేళ్లు ఇస్తాం. ఐఆర్‌ను ప్రకటిస్తాం. పీఆర్సీని అపాయింట్‌ చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ, పీఆర్సీ ఏర్పాటు జరగలేదు. కనీసం ఐఆర్‌నైనా ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అక్టోబరు 10లోపు ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందన్న సంకేతాలుండడంతో.. ఐఆర్‌ను ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తోంది.

అన్నీ అనుకూలిస్తే.. 29న జరిగే క్యాబినెట్‌ భేటీ ఉంటుందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనేదే ప్రధాన ఎజెండా కానుందని అధికారవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ భేటీలో ఐఆర్‌పై కీలక ప్రకటన ఉంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే 22-30ు ఐఆర్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, 10-20ు ఇవ్వొచ్చని సమాచారం. విశ్రాంత ఐఏఎస్‌ అధికారులతో పీఆర్సీని క్యాబినెట్‌ ఆమోదించనున్నట్లు సమాచారం. పీఆర్సీలో వీకే అగర్వాల్‌, రాజేశ్వర్‌ తివారి, బీఆర్‌ మీనా, రాణి కుముదిని, బూసాని వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, శివశంకర్‌ వంటి విశ్రాంత ఐఏఎ్‌సలతోపాటు.. బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉంటారని తెలుస్తోంది. ఐఆర్‌, పీఆర్సీపై స్పష్టమైన వైఖరితో సర్కారు ఉందని, వాటిపై నిర్ణయాలను ప్రకటించాకే ఎన్నికలకు వెళ్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు.. పెండింగ్‌లో ఉన్న 3 డీఏల్లో ఒకదాన్ని క్లియర్‌ చేసే అవకాశాలున్నాయని సచివాలయవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-09-21T02:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising