ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో మనస్తాపం.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-03-02T02:14:54+05:30

అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌ చూస్త్తున్న కొడుకును తల్లి మందలించి, ఫోన్‌ లాక్కోవడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థి భవనంపై నుంచి దూకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సైదాబాద్‌, మార్చి1(ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌ చూస్త్తున్న కొడుకును తల్లి మందలించి, ఫోన్‌ లాక్కోవడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సైదాబాద్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. ఐఎ్‌ససదన్‌ డివిజన్‌ ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీలో నివాసముండే పోతురాజ్‌ ఏపీలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా, ఆయన భార్య సంగీత బోజ్‌రెడ్డి మహిళా కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దొంతం ధృవ కాపర్తి(16) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. కొద్ది నెలలుగా చదువు నిర్లక్ష్యం చేస్తూ సెల్‌ఫోన్‌కు బానిసై మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి కూడా ధృవ నిద్రపోకుండా సెల్‌ఫోన్‌ చూస్తుండగా.. తల్లి అతడి దగ్గర నుంచి ఫోన్‌ లాక్కుని నిద్రపొమ్మని చెప్పింది. మనస్తాపానికి గురైన ధృవ బయటకు వెళ్లి, ఇంటికి తాళం వేసి, ఐదో అంతస్తు నుంచి దూకాడు. గాయాపాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Updated Date - 2023-03-02T02:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!