తెలంగాణ ప్రగతిలో గాంధీజీ ఆశయాల స్ఫూర్తి
ABN, First Publish Date - 2023-10-03T03:49:00+05:30
తెలంగాణ సాధనతోపాటు స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మహాత్మాగాంధీ ఆశయాలు, సిద్థాంతాలు, విజయాల స్పూర్తి నెలకొందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్యానికి రాష్ట్రంలోని పల్లెలే ప్రతిరూపం: కేసీఆర్
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధనతోపాటు స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో మహాత్మాగాంధీ ఆశయాలు, సిద్థాంతాలు, విజయాల స్పూర్తి నెలకొందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సీఎం ఆయన్ను స్మరించుకున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపంగా నిలిచాయని పేర్కొన్నారు.
Updated Date - 2023-10-03T03:49:00+05:30 IST