ఇండోర్ స్టేడియంను మోడల్‌గా తీర్చిదిద్దుతాం
ABN, First Publish Date - 2023-01-27T01:08:15+05:30
ఆలేరు ఇండోర్ స్టేడియంను మోడల్ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ ఈడిగ ఆంజనేయులుగౌడ్ అన్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ఇండోర్ స్టేడియాన్ని గురువారం ఆయన సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారికి అతి సమీపంలో ఏడు ఎకరాల స్థలంలో స్టేడియంను స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ ఆంజనేయులు గౌడ్
ఆలేరు, జనవరి 26: ఆలేరు ఇండోర్ స్టేడియంను మోడల్ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ ఈడిగ ఆంజనేయులుగౌడ్ అన్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ఇండోర్ స్టేడియాన్ని గురువారం ఆయన సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారికి అతి సమీపంలో ఏడు ఎకరాల స్థలంలో స్టేడియంను స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్టేడియానికి అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వైస్‌చైర్మన్ గ్యాదపాక నాగరాజు, జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి ధనుంజయ్య, కౌన్సిలర్ కందుల శ్రీకాంత్, బీఆర్‌ఎస్ నాయకులు తుంగ బాలు, వెంకటేష్ యాదవ్, గీస కృష్ణంరాజు, మన్నె సంతోష్, రమణారెడ్డి, జింకల భరత్, ర్యాగల లింగం, బాల్‌రాజ్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-01-27T01:09:05+05:30 IST