ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC KAVITHA: డిగ్రీ చదివిన వారు ఖాళీగా ఉంటే.. ఏ డిగ్రీలేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం

ABN, First Publish Date - 2023-04-03T01:50:23+05:30

దేశంలో డిగ్రీలున్న లక్షల మంది ఉద్యోగావకాశాల్లేక ఖాళీగా ఉంటే.. ఎటువంటి డిగ్రీ లేని వ్యక్తి మాత్రం అత్యున్నత ఉద్యోగంలో ఉన్నారంటూ.. ప్రధాని మోదీని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రధాని మోదీని ఉద్దేశించి కవిత విమర్శలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో డిగ్రీలున్న లక్షల మంది ఉద్యోగావకాశాల్లేక ఖాళీగా ఉంటే.. ఎటువంటి డిగ్రీ లేని వ్యక్తి మాత్రం అత్యున్నత ఉద్యోగంలో ఉన్నారంటూ.. ప్రధాని మోదీని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగ రేటుపై ఆదివారం ట్విటర్‌ ద్వారా స్పందించిన ఆమె.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై, మోదీపై సెటైర్లు వేశారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని, ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి.. అని వెల్లడించారు. ‘నేడు భారతదేశంలో ఉన్న వాస్తవం ఏంటంటే.. నిజమైన డిగ్రీ ఉన్నవాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికి మాత్రం అత్యున్నతమైన ఉద్యోగం ఉంది’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కవిత ప్రశ్నించారు.

Updated Date - 2023-04-03T01:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising