షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలిస్తే.. జగన్ పని అయిపోయినట్టే
ABN, First Publish Date - 2023-06-26T04:03:51+05:30
‘సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. మా దగ్గర పక్కా సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే జగన్ పని అయిపోయినట్టే’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు.....
ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు
కడప, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. మా దగ్గర పక్కా సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే జగన్ పని అయిపోయినట్టే’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కడపలో జరిగిన మేధావుల సభ అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాడు కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి జగన్ వైసీపీని పెట్టారు. అలాగే తెలంగాణలో వైఎ్‌సఆర్‌సీటీ అని షర్మిల పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి కాంగ్రె్‌సలోకి వెళ్తోంది. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని జగన్‌కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రానికి వచ్చి నాన్న వైఎస్ పాలన వేరు, జగన్ పాలన వేరు అని చెపితే చాలు. ఆ ఒక్క మాటతో జగన్ పని అయిపోయినట్టే. ఇదే జరుగుతుంది. ఆ మేరకు కచ్చితమైన సమాచారం మాకు ఉంది’’ అని ఆదినారాయణరెడ్డి అన్నారు.
Updated Date - 2023-06-26T04:03:51+05:30 IST