Fake Baba : నీ నగ్న ఫొటోలు నా దగ్గరున్నయ్!
ABN, First Publish Date - 2023-06-11T03:01:49+05:30
‘నీ నగ్న ఫొటోలు, వీడియాలు నా మొబైల్‌లో ఉన్నాయి. ఇప్పుడు నాకు రూ.5 లక్షలు ఇవ్వకపోతే, వాటిని యూట్యూబ్‌లో పోస్టు చేస్తా. ఆ తర్వాత నీ పరువు బజారున పడుతుంది’.. ఇదీ ఓ నకిలీ బాబా బాధిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు. ఇలా మహిళల బలహీనతలను
● 5 లక్షలివ్వు, లేదా యూట్యూబ్‌లో పెడతా
● ఓ మహిళకు నకిలీ బాబా వేధింపులు
● చితకబాది పోలీసులకు అప్పగించిన వైనం
తొర్రూరు, జూన్ 10 : ‘నీ నగ్న ఫొటోలు, వీడియాలు నా మొబైల్‌లో ఉన్నాయి. ఇప్పుడు నాకు రూ.5 లక్షలు ఇవ్వకపోతే, వాటిని యూట్యూబ్‌లో పోస్టు చేస్తా. ఆ తర్వాత నీ పరువు బజారున పడుతుంది’.. ఇదీ ఓ నకిలీ బాబా బాధిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు. ఇలా మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని పూజల పేరిట ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు గురి చేస్తున్న ఆ నకిలీ బాబాను మహిళా సంఘాల సభ్యులు చితకబాది పోలీసులకు అప్పగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తికి చెందిన ఓ మహిళ.. అనారోగ్యంతో భర్త చనిపోవడంతో హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటూ జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తూ, తన కుటుంబాన్ని పోషించుకొంటోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బంధువుల ఇంటికి శుభకార్యం కోసం వచ్చింది. తనకు ఆరోగ్యం బాగాలేదని బంధువులకు తెలుపగా, ఇక్కడ ఓ స్వామిజీ ఉన్నాడు, పూజలు చేసి బాగు చేస్తాడని వారు చెప్పడంతో పెద్దవంగరకు చెందిన ఎదురుగట్ల యాకయ్య (గుర్రం బాబా) అలియాస్ శ్రీను గురుస్వామిని కలిసి తన బాధను వెళ్లబోసుకొంది. దీంతో తాయెత్తులు కట్టి బాగు చేస్తానని చెప్పి, పూజల పేరుతో ఆమెను నగ్నంగా ఉంచి ఫొటోలు, వీడియోలు తీశాడు. ఈక్రమంలో ఏడాదిగా వివిధ ప్రాంతాలకు తిప్పుతూ.. సుమారు రూ.4లక్షల మేర ఆమెను నుంచి వసూలు చేసి, ఇబ్బందులకు గురి చేశాడు. రెండు రోజుల క్రితం బాధితురాలికి ఫోన్ చేసి రూ.5లక్షలు ఇవ్వకుంటే వీడియోలను యూ ట్యూబులో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లోని పార్శిగుట్ట మహిళా సంఘాలను ఆశ్రయించింది. తొర్రూరులో కాపు కాచిన మహిళా సంఘాల ప్రతినిధులు యాకయ్యను పట్టుకొని చితకబాది, పోలీసులకు అప్పజెప్పారు.
Updated Date - 2023-06-11T03:01:49+05:30 IST