ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ సంక్షేమ శాఖలో అధికారులేరి?

ABN, First Publish Date - 2023-01-08T03:31:50+05:30

బీసీ సంక్షేమ శాఖలో అధికారుల కొరత తీవ్రంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యను పట్టించుకునే దిక్కు లేదు

కార్పొరేషన్లకూ లేని ఎండీలు, చైర్మన్లు

గురుకులాలకు ఐఏఎస్‌ లేక ఇబ్బందులు

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ శాఖలో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. బీసీల అభున్నతికి ప్రణాళికలు రచించేందుకు అవసరమైన ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది లేక శాఖ సతమతమవుతోంది. శాఖ పరిధిలో ఉన్న బీసీ కార్పొరేషన్‌, ఎంబీసీ కార్పొరేషన్‌, గురుకులాలు, హాస్టళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఈ వర్గాల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ శాఖలో ప్రస్తుతం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న అధికారి వివిధ విభాగాల్లో ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే అధికారి సంక్షేమ భవన్‌లో ప్రతిపాదనలు చేసి, సచివాలయంలో ఆమోదం తెలుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీసీ కమిషన్‌కు ప్రస్తుతం చైర్మన్‌ ఉన్నా.. సెక్రటరీ లేకపోవడంతో ఇబ్బంది అవుతోంది. ఈ పోస్టుకూ ప్రిన్సిపల్‌ సెక్రటరీనే బాధ్యత వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల కంటే బీసీ శాఖ పరిధిలోనే 310 గురుకులాలు ఉన్నాయి. అయినా వీటికి పూర్తిస్థాయి ఐఏఎస్‌ అధికారి లేరు. వాస్తవానికి బీసీ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఒక కమిషనర్‌, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు ఎండీలు, బీసీ కమిషన్‌కు సెక్రటరీలుగా ఐఏఎస్‌ అధికారులు ఉండాలి. కానీ అసలు ఈ పోస్టులకు నాన్‌ ఐఏఎస్‌ అధికారులు కూడా లేరు.

ఆయా విభాగాల్లో పోస్టులన్నింటికీ ప్రిన్సిపల్‌ సెక్రటరీనే ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తుండడం గమనార్హం. వీటితో పాటు గురుకులాలకు సెక్రటరీగా ప్రత్యేకంగా ఒక ఐఏఎ్‌సను, అడిషనల్‌ సెక్రటరీని నియమించాల్సి ఉన్నా.. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం వీటికి అధికారిగా నాన్‌ ఐఏఎస్‌ వ్యక్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాయింట్‌ డైరెక్టర్లు ముగ్గురికి బదులు ఒక్కరే ఉన్నారు. బీసీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను రద్దు చేసి, వీరి బాధ్యతలను ప్రభుత్వం జిల్లా బీసీ అధికారికి అప్పగించింది. దీంతో జిల్లాల అధికారులకు విధులు తమకు మించిన భారంగా మారాయన్న భావనలో ఉన్నారు. పైగా బీసీ శాఖకు చెందిన పలువురు సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపుతున్నారు. దీంతో క్షేత్రస్థారులోనూ శాఖను సిబ్బంది సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా జిల్లాల్లోని గురుకులాలు, హాస్టళ్లలో సిబ్బంది లేరు. మెదక్‌ జిల్లాలోని హాస్టళ్లలో ఒక్కరి చొప్పునే సిబ్బంది ఉండడంతో అక్కడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా బీసీ శాఖలో ఉన్నతాధికారులు లేకపోవడంతో ఆ వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటికైనా అధికారులను నియమించి సమస్యలను పరిష్కరించాలని బీసీ వర్గాలు కోరుతున్నాయి.

Updated Date - 2023-01-08T03:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising