ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌ సీపీ రంగనాథ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2023-03-31T03:10:32+05:30

‘కబ్జాదారుల చెర నుంచి మా ప్లాట్లను కాపాడిన దేవుడు’ అని పేర్కొంటూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌(సీపీ) రంగనాథ్‌ చిత్రపటానికి గురువారం పలువురు క్షీరాభిషేకం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏళ్లనాటి భూసమస్యను పరిష్కరించడంతో బాధితుల కృతజ్ఞత

వరంగల్‌ సిటీ, మార్చి 30: ‘కబ్జాదారుల చెర నుంచి మా ప్లాట్లను కాపాడిన దేవుడు’ అని పేర్కొంటూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌(సీపీ) రంగనాథ్‌ చిత్రపటానికి గురువారం పలువురు క్షీరాభిషేకం చేశారు. ఏళ్లనాటి తమ భూసమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞత తెలియజేశారు. వరంగల్‌ జిల్లా ఏనుమాములలోని బాలాజీనగర్‌ భూ బాధితులు లేబర్‌కాలనీకి వెళ్లే వంద అడుగుల రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్‌, కోదాటి రమేష్‌, గౌస్‌ బేగం, ఆడెపు భిక్షపతి, రాజు, దేవులపల్లి మల్లేష్‌ తదితరులు కొన్నేళ్ల క్రితం బాలాజీనగర్‌లో స్థలాలు కొనుగోలు చేశారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు అనుయాయులతో ఆ భూములను ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై బాధితులు మంగళవారం సీపీని ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఆయన టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. పూర్తి విచారణ జరిపిన టాస్క్‌ఫోర్స్‌ బృందం నిజనిర్ధారణ చేసుకుని ఎవరి ప్లాట్లు వారికి అప్పగించాలని కబ్జాదారులను హెచ్చరించింది. హర్షం వ్యక్తం చేసిన బాధితులు.. సీపీ రంగనాథ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞత తెలియజేశారు.

Updated Date - 2023-03-31T03:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising