ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌కు అస్వస్థత

ABN, First Publish Date - 2023-01-04T04:26:52+05:30

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన విపరీతమైన దగ్గు, వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) నాయకులు కె.వి.జాన్సన్‌, కోడూరి ప్రకాశ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం నాయకులు

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన విపరీతమైన దగ్గు, వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) నాయకులు కె.వి.జాన్సన్‌, కోడూరి ప్రకాశ్‌ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ఆయన వైద్యుల సలహాతో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభాకర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ కూడా ఫోన్‌ చేసి, ఆరా తీశారని తెలిపారు. మంగళవారం ఆయన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్‌ ఉద్యోగులకు ఆరునూరైనా వేతన సవరణ చేస్తామని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారన్నారు. వైద్యుల సలహాతోనే సెలవు తీసుకున్నానని, ఇతర కారణాలు ఏమీ లేవని, ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ విధుల్లో చేరతానని ప్రభాకర్‌రావు తమతో చెప్పారని వారు వివరించారు.

Updated Date - 2023-01-04T04:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising