ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN, First Publish Date - 2023-01-18T00:32:18+05:30

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు పోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్వాల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు పోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం వెంకటాపురం డివిజన్‌లోని దినకర్‌నగర్‌లో ఆయన కార్పొరేటర్‌ సబితాకిషోర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయాలను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్లు సమస్య ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఆయన అధికారులతో మాట్లాడి ప్రపోజల్స్‌ సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ రాజు, డీఈ కార్తీక్‌, ఎఈ అరుణ్‌, విజయ్‌కుమార్‌గౌడ్‌, అమర్‌నాథ్‌, కృష్ణారావు, సూర్యకిరణ్‌ పాల్గొన్నారు.

మౌలాలి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మౌలాలి డివిజన్‌ ఆర్కేహెచ్‌ కాలనీలో ఎమ్మెల్యే మైనంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మురుగునీటి పైపులైన్‌ నిర్మాణ పనులు, సీసీ రోడ్డు, పార్కు స్థలం అభివృద్ధి, సీసీ కెమోరాలు ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే స్పందించి దశలవారీగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈ మహేష్‌, ఏఈ మధురిమ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌, కాలనీ మాజీ అధ్యక్షుడు భిక్షపతిచారి, అధ్యక్షుడు రాజీరెడ్డి, కార్యదర్శి దివాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు సర్కిల్‌ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌, గ్రేటర్‌మాజీ కార్యదర్శి అమీనుద్దీన్‌, డివిజన్‌ మాజీ అధ్యక్షుడు భాగ్యనందరావు, డివిజన్‌ అధ్యక్షుడు సత్తయ్య, నాయకులు జోగు శ్రీనివాస్‌, మంద భాస్కర్‌మాదిగ, చంద్రకాంత్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising