ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు

ABN, First Publish Date - 2023-01-14T23:51:09+05:30

సంక్రాంతికి నగరంలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు స్వస్థలాలకు వెళ్లారు.

సైకిల్‌పై పెట్రోలింగ్‌ చేస్తున్న డీసీపీ శిల్పవల్లి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైకిళ్లపై యువత, పోలీసుల పెట్రోలింగ్‌

మియాపూర్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి నగరంలో నివాసం ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు స్వస్థలాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎటువంటి దొంగతనాలు, అసాంఘీక కార్యక్రమాలు జరగకుండా మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బందితో ఆయా కాలనీల్లో పర్యటించి స్థానికులకు అవగాహన కల్పించారు. మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో డీసీపీ స్థానిక యువకులు, సిబ్బందితో కలిసి సైకిల్‌పై పెట్రోలింగ్‌ నిర్వహించారు. కాలనీల్లోని యువతను గ్రూపులుగా ఏర్పాటు చేసి రాత్రి సమయంలో సైకిళ్లపై గస్తీకాసేలా వారికి అవగాహన కల్పించారు. సొంతూళ్లకు వెళ్లిన వారి ఇళ్లవద్ద పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ దొంగతనాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో కరపత్రాలు ముద్రించి ఆయా కాలనీలు, బస్తీలలో పంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, అపార్టుమెంటులు, కాలనీల్లో వాచ్‌మన్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, నిర్మానూష్య ప్రాంతాల్లో, తాళాలు వేసివున్న ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

Updated Date - 2023-01-14T23:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising