ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్నల్‌ ఫ్రీ

ABN, First Publish Date - 2023-03-26T00:49:03+05:30

వనస్థలిపురం-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ప్రారంభమైన వంతెనతో ఎల్‌బీనగర్‌ చౌరస్తా సిగ్నల్‌ ఫ్రీగా మారింది.

వనస్థలిపురం-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ప్రారంభమైన వంతెన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌

ప్రారంభమైన మరో వంతెన

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ప్రారంభమైన వంతెనతో ఎల్‌బీనగర్‌ చౌరస్తా సిగ్నల్‌ ఫ్రీగా మారింది. నగరవాసుల ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌పెట్టే దిశగా గ్రేటర్‌లో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన 47 పనుల్లో 32 పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఇందులో భాగంగా రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభంతో విజయవాడ-హైదరాబాద్‌కు ప్రయాణికులు సిగ్నల్‌ ఆటంకాలు లేకుండా ఎల్‌బీనగర్‌ చౌరస్తా వద్ద రయ్‌మంటూ దూ సుకెళ్లవచ్చు. ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతోపాటు హయత్‌నగర్‌ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు వచ్చే వారికి ఇబ్బందులు అలాగే, ఉప్పల్‌, సరూర్‌నగర్‌తోపాటు పలుప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్‌ చిక్కులు తీరనున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే దిల్‌సుఖ్‌నగర్‌-వనస్థలిపురం మార్గంలో ఓ ఫ్లైఓవర్‌ ఉంది. అండర్‌పాస్‌ కూడా గతంలోనే ప్రారంభించారు.

Updated Date - 2023-03-26T00:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising