ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంట నూనె ఉత్పత్తికి పరిశోధనలు జరగాలి

ABN, First Publish Date - 2023-01-18T00:22:09+05:30

దేశంలో తలసరి వంట నూనె వాడకం సంవత్సరానికి 18.7 కిలోలుగా ఉందని, దాని ప్రకారం 2050 నాటికి 40.89 మిలియన్‌ టన్నుల వంట నూనె అవసరపడుతుందని, అందుకోసం అవసరమైన పరిశోధనలు జరగాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మంగళారాయ్‌ అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): దేశంలో తలసరి వంట నూనె వాడకం సంవత్సరానికి 18.7 కిలోలుగా ఉందని, దాని ప్రకారం 2050 నాటికి 40.89 మిలియన్‌ టన్నుల వంట నూనె అవసరపడుతుందని, అందుకోసం అవసరమైన పరిశోధనలు జరగాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మంగళారాయ్‌ అభిప్రాయపడ్డారు. భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ (ఐఐఓఆర్‌), భారతీయ నూనెగింజల పరిశోధనా సంఘం (ఐఎ్‌సఓఆర్‌) సంయుక్తంగా ఐదు రోజుల పాటు రాజేంద్రనగర్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వంట నూనెల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ మంగళారాయ్‌ మాట్లాడుతూ, ద్వితీయ శ్రేణి వ్యవసాయాన్ని పెంపొందించడంలో మానవ వనరులు, సాంకేతిక అభివృద్ధి అనివార్యమన్నారు. ఐసీఏఆర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఆయిల్‌సీడ్స్‌ అండ్‌ పల్సెస్‌) డాక్టర్‌ సంజీవ్‌ గుప్తా మాట్లాడుతూ నూనె గింజల ఉత్పత్తిని మూడింతలు పెంచి పసుపు విప్లవం సాధించడంలో టెక్నాలజీ మిషన్‌ పాత్రను గుర్తు చేసుకున్నారు. కర్ణాటక ఆయిల్‌ ఫెడరేషన్‌ చైౖర్మన్‌, పార్లమెంట్‌ సభ్యుడు అన్నా సాహెబ్‌ శంకర్‌ జోల్లె మాట్లాడుతూ, స్వల్ప కాలిక, అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి ద్వారా నూనెగింజల్లో ఆత్మ నిర్భరత సాధించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా 24 మంది అభ్యుదయ రైతులను సన్మానించారు. 50 మంది నూనె గింజల పరిశోధకులకు ఐఎ్‌సఓఆర్‌ ఫెలోషిప్‌ ఇచ్చారు. నూనె గింజల పరిశోధనలపై మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వివిధ ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఫేర్‌ ల్యాబ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జితేంద్ర మాధుర్‌, నేషనల్‌ డైరీ డెవల్‌పమెంట్‌ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ మినేష్‌ షా, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ నీరజ ప్రభాకర్‌, ఐఐఓఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కే.మాథూర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising