ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ డీలర్ల సమ్మె విరమరణ

ABN, First Publish Date - 2023-06-07T04:03:03+05:30

డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన రేషన్‌ డీలర్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తో చర్చలు జరిపిన అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి గంగులతో చర్చలు సఫలం

నేటి నుంచి బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన రేషన్‌ డీలర్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తో చర్చలు జరిపిన అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. దీంతో ఆరు రోజులుగా నిలిచిపోయిన ఉచిత బియ్యం పంపిణీ బుధవారం నుంచి మొదలు కానుంది. రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కొద్ది రోజులుగా వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. జూన్‌ 1 నుంచి బియ్యం పంపిణీ నిలిపివేశారు. మంగళవారం మంత్రి గంగుల కమలాకర్‌ రేషన్‌ డీలర్లతో సచివాలయంలో చర్చలు జరిపారు. కమీషన్‌ పెంపు, గౌరవ వేతనం ప్రతిపాదలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

Updated Date - 2023-06-07T04:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising